Gold Price Today: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో రూ.11,500 పెరుగుదల!
బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరుగుదల , ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాలు బంగారం ధరలను చుక్కలను తాకుతున్నాయి. భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం లక్షకు పోయే అవకాశం లేకపోలేదంటూ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు ₹10,500 పెరిగింది, 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు ₹11,500 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే:
నగరం 22 క్యారెట్ల బంగారం (గ్రాముకు) 24 క్యారెట్ల బంగారం (గ్రాముకు)
హైదరాబాద్: ₹7,810- ₹8,520
విజయవాడ: ₹7,810- ₹8,520
విశాఖపట్నం: ₹7,810 -₹8,520
ఢిల్లీ :₹7,825- ₹8,535
ముంబై: ₹7,810- ₹8,520
చెన్నై: ₹7,810- ₹8,520
బెంగళూరు: ₹7,810- ₹8,520
కోల్‌కతా: ₹7,810- ₹8,520
ధరల పెరుగుదలకు కారణాలు:
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ధరల కదలికలు, డాలర్ మారకం విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి ప్రధాన కారణాలు బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం , వెండి ధరలు భవిష్యత్తులో కూడా మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడాలపై అమెరికా ప్రభుత్వ టారిఫ్ విధానాలు ద్రవ్యోల్బణంగా కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిర ఈక్విటీ మార్కెట్లతో ఆజ్యం పోసిన మార్కెట్ అనిశ్చితి ఇన్వెస్టర్లను బంగారం వైపు నెట్టేస్తోంది.
వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీకి ₹1,000 తగ్గి, ప్రస్తుతం ₹1,06,000 వద్ద ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలర్స్ వద్ద ధరలు చెక్ చేయడం మంచిది, ఎందుకంటే నగరానుసారం, టాక్సుల ఆధారంగా స్వల్ప మార్పులు ఉండొచ్చు. అలాగే, మీ స్థానిక నగల దుకాణంలో ధరలను కూడా తెలుసుకోండి.












Click it and Unblock the Notifications