Gold Price Today: బంగారం ధరలు ఆకాశానికి.. కొనడానికి ఇది సరైన సమయమేనా?

భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలను తాకుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 90,000 మార్కును దాటేసింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 82,900కు చేరుకుంది. ఈ పెరుగుదల స్వల్పంగా కనిపించినా, రానున్న రోజుల్లో ఇది మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 67,830 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 82,900, 24 క్యారెట్ల బంగారం రూ. 90,440 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ. 82,900, 24 క్యారెట్ల బంగారం రూ. 90,440గా ఉంది.

gold-prices-are-skyrocketing-is-this-the-right-time-to-buy

అంటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండికి దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. చెన్నై: కిలో వెండి ధర: రూ.1,15,800, బెంగళూరు కిలో వెండి ధర: రూ.1,06,200, హైదరాబాద్ కిలో వెండి ధర: రూ.1,16,400, విశాఖపట్నం కిలో వెండి ధర రూ.1,14,800, విజయవాడ కిలో వెండి ధర రూ.1,17,200లకు పెరిగింది. నిన్నటి ధర రూ.1,16,000గా ఉంది.

బంగారం ధరలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడటం, ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడం ప్రధాన కారణాలు. అంతేకాకుండా, చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దీనికి తోడు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే, దేశీయంగా కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని తాజా ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+