బంగారం రేట్లు తగ్గాయ్.. పండుగ వేళ వరసగా రెండో రోజు ఢమాల్

పసిడి కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ చుక్కలు చూపించిన బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గి ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, స్థానిక డిమాండ్‌లో వచ్చిన మార్పులతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. పండుగల సీజన్ ముగిసి, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న వేళ ఈ తగ్గింపు కొనుగోలుదారులకు, సామాన్యులకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తోంది.

పసిడి ప్రేమికులకు ఊరట.. హైదరాబాద్‌లో తగ్గిన ధరలివే!

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ట్రెండ్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై రూ.390 తగ్గడంతో రూ.1,49,290కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.1,36,850 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు రోజులుగా ధరలు స్వల్పంగా తగ్గుతుండటంతో గోల్డ్ షాపులకు కస్టమర్ల రాక పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Gold Prices Decline for Second Consecutive Day in Hyderabad Markets While Silver Remains Steady Today
బంగారం ధరలు అనూహ్యంగా తలకిందులు- గట్టిగా దెబ్బకొట్టిన సౌదీ అరేబియా పరిణామాలు
బంగారం ధరలు అనూహ్యంగా తలకిందులు- గట్టిగా దెబ్బకొట్టిన సౌదీ అరేబియా పరిణామాలు

స్థిరంగా వెండి.. ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు!

బంగారం దారిలోనే వెండి కూడా తగ్గుతుందని ఆశించిన వారికి మాత్రం నిరాశే ఎదురైంది. కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,45,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ఆధారంగా నమోదైనవి. స్థానిక పన్నులు, ప్రాంతీయ డిమాండ్ ఆధారంగా వేర్వేరు నగరాలు, జిల్లాల్లో ధరల్లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంటుంది.

బంగారం ధరల స్ట్రాంగ్ అవుట్‌లుక్- ఈ వారంలో కమ్‌బ్యాక్ కు ఛాన్స్
బంగారం ధరల స్ట్రాంగ్ అవుట్‌లుక్- ఈ వారంలో కమ్‌బ్యాక్ కు ఛాన్స్

కొనుగోలు చేసేముందు ఇది గుర్తుంచుకోండి!

మీరు వ్యాపారుల వద్ద ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు చేసే సమయంలో పైన పేర్కొన్న బులియన్ రేట్లతో పాటు అదనంగా 3 శాతం జీఎస్టీ (GST) వర్తిస్తుందని గమనించాలి. దీనికి తోడు జ్యువెలరీ షాపులు విధించే తయారీ కూలి, తరుగు (మేకింగ్ & వేస్టేజ్ ఛార్జీలు) అదనంగా చేరతాయి. కాబట్టి కొనుగోలుదారులు మార్కెట్ ధరలను ప్రత్యక్షంగా సరిచూసుకుని ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+