బంగారం రేట్లు కుప్పకూలుతున్నాయ్..!!
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇన్ని రోజులూ పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో డౌన్ ఫాల్ మొదలైంది. రెండు రోజుల కిందటే రికార్డు స్థాయికి చేరిన రేట్లు.. ఇప్పుడు పాతాళానికి చేరుకుంటోన్నాయి. నేడు కాస్త ఊరటనిచ్చాయి. పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 300 రూపాయలకు పైగా క్షీణించాయి. దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధరలో 3,500 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. రూ.1,39,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల బంగారం ఢిల్లీ, జైపూర్ లల్లో 1,27,790, అహ్మదాబాద్, పుణెల్లో రూ. 1,27,690, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా రూ. 1,27,640 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ఢిల్లీ, జైపూర్ రూ. 1,39,390, అహ్మదాబాద్, పుణె రూ. 1,39,290, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా రూ. 1,39,240గా నమోదయ్యాయి. సురక్షిత పెట్టుబడుల డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,746, 22 క్యారెట్లు - రూ. 12,600, 18 క్యారెట్లు - రూ. 10,505
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు - రూ. 10,193
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193

Click it and Unblock the Notifications