Gold rate Today : మళ్లీ కొండెక్కి కూర్చుకున్న బంగారం .. ఇవాల్టి రేట్లు చూడండి!
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. తగ్గేటప్పుడు పదుల్లో తగ్గుతూ.. పెరిగేటప్పుడు వందల్లో పెరుగుతూ ఉండటంతో బంగారం పేరు వింటేనే సామాన్యుడికి చెమటలు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు వెరసి పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడిదారులంతా సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న వేళ, బంగారం ధరలు ఇలా పెరగడం మరింత కలవరపెడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరులో ఒకే రకంగా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.8,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,195 ఉంది. నిన్నటితో పోల్చితే 22 క్యాకెట్ల బంగారం గ్రాముకు రూ. 10 , 24 క్యారెట్ గోల్డ్ రూ. 11 పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌కు రూ. 110 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 110 పెరిగింది.

ఢిల్లీ, ముంబైలో బంగారం ధరలు.
ఇక దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.82,100కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.89,550 వద్దకు చేరింది. చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముంబై మార్కెట్‌లో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 81,950 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,400 గా కొనసాగుతోంది. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.
బంగారం ధరలు వెండి ధరల్లోనూ బుధవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) మంగళవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. అయితే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మాత్రం బంగారం ధరలు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ. 87,462 వద్ద ట్రేడ్ అవుతూ స్వల్పంగా తగ్గింది. కానీ వెండి మాత్రం MCX లో కూడా జోరు కొనసాగించింది. కిలో వెండి ధర రూ. 99,159 వద్ద ట్రేడ్ అవుతోంది.












Click it and Unblock the Notifications