కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్

దేశంలో నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకిన పసిడి, కరెక్షన్ కారణంగా స్థిరత్వాన్ని కోల్పోయింది. భారీగా తగ్గుతోంది. ప్రారంభ సెషన్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.62 లక్షల రూపాయలకు చేరింది. గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 0.32 శాతం తగ్గుదల కనిపించింది. సుమారు రూ. 1,600 నుండి 1,700 రూపాయల వరకు తగ్గింది.

ఈ ధరల పతనం- భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా చోటు చేసుకున్న పెరుగుదల అనంతరం రికార్డయింది. అంతర్జాతీయ బులియన్ ధరల్లో విస్తృత కరెక్షన్‌కు సూచికగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,080 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం మొదట్లో ఈ రేటు 5,400 డాలర్లకు పైగా నమోదైన విషయం తెలిసిందే. రికార్డు గరిష్ఠ స్థాయి నుండి వీటి రేట్లు యూటర్న్ తీసుకున్నాయి.

Gold Prices Slip from Record Highs as Indian Markets See 1 62 Lakh per 10 gram reflects a correction

రాబోయే రోజుల్లో బంగారం ధరలు అత్యంత అస్థిరంగా ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు మధ్యప్రాచ్య సంఘర్షణ పరిణామాలు, అమెరికన్ డాలర్ కదలికలు, రాబోయే యూఎస్ ఫైనాన్షియల్ డేటాపై నిశితంగా దృష్టి సారించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే, సురక్షిత పెట్టుబడుల డిమాండ్‌తో ధరలు మళ్లీ పెరిగే అవకాశాలను కొట్టిపారేయట్లేదు.

ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 1,64,500 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,790 వద్ద లభ్యమవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.63 శాతం మేర పెరిగింది. 10 గ్రాములకు 1,62,542 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా 1.62 శాతం మేర పెరిగి కిలో రూ. 2,69,895గా నమోదైంది. అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,494, 22 క్యారెట్లు - రూ. 15,119, 18 క్యారెట్లు - రూ. 13,038

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,287, 22 క్యారెట్లు- రూ. 15,929, 18 క్యారెట్లు - రూ. 12,215

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,287, 22 క్యారెట్లు- రూ. 15,929, 18 క్యారెట్లు - రూ. 12,215

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,287, 22 క్యారెట్లు- రూ. 15,929, 18 క్యారెట్లు - రూ. 12,215

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,287, 22 క్యారెట్లు- రూ. 15,929, 18 క్యారెట్లు - రూ. 12,215

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,287, 22 క్యారెట్లు- రూ. 15,929, 18 క్యారెట్లు - రూ. 12,215

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+