ఊహకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు

బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఊహకు అందనంతగా ఎత్తకు చేరాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడం, డాలర్ పతనం, ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు వంటి అంశాలతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్ళారు. దీని ఫలితంగా, బంగారం, వెండి ధరలు నేడు ఎంసీఎక్స్ మార్కెట్‌లో రికార్డుస్థాయికి చేరాయి. గరిష్ఠ రేటును నమోదు చేశాయి. గత రికార్డులను చెరిపేశాయి వీటి రేట్లు.

ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 2,400లకు పైగా పెరిగింది. 1.8 శాతం వృద్ధితో 10 గ్రాములకు రూ. 1,41,250 రూపాయలకు చేరుకుంది. ఇది ఆల్-టైమ్ హై. ఇప్పటివరకు ఈ స్థాయిలో బంగారం ధరలు ఎప్పుడూ పెరగలేదు. గతంలో 1,40,000 రూపాయల మార్క్ ను దాటిందే గానీ ఈ మొత్తాన్ని అందుకోలేదు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. అలాగే ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ సైతం భారీగా పెరిగాయి. నాలుగు శాతానికి పైగా ఎగబాకింది. కిలో వెండి రూ. 2,63,996 వద్ద కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

Gold prices surges as amid global demand and USD strength

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు విభిన్నంగా నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ, జైపూర్‌లలో అత్యధికంగా రూ. 1,40,600గా ఉండగా, అహ్మదాబాద్‌లో రూ. 1,40,500కి చేరింది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రూ. 1,40,450 వద్ద నమోదైంది. ఇదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీ, జైపూర్‌లలో రూ. 1,28,890, అహ్మదాబాద్‌లో రూ. 1,28,790, మిగిలిన నగరాల్లో రూ. 1,28,740గా కొనసాగింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,313, 22 క్యారెట్లు - రూ. 13,120, 18 క్యారెట్లు - రూ. 10,945

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,215, 22 క్యారెట్లు- రూ. 13,030, 18 క్యారెట్లు - రూ. 10,661

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,215, 22 క్యారెట్లు- రూ. 13,030, 18 క్యారెట్లు- రూ. 10,661

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,215, 22 క్యారెట్లు- రూ. 13,030, 18 క్యారెట్లు- రూ. 10,661

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,215, 22 క్యారెట్లు- రూ. 13,030, 18 క్యారెట్లు- రూ. 10,661

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,215, 22 క్యారెట్లు- రూ. 13,030, 18 క్యారెట్లు- రూ. 10,661

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+