Gold Rate Today : బంగారం ధర పరుగులు.. ఒక్కరోజులోనే తులం రూ. 2,900 పెరిగిన పసిడి

బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో సామాన్యులు షాక్ తిన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగుపాటులా మారింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు దూసుకుపోయాయి. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు వినియోగదారులను అయోమయంలో పడేశాయి.

పసిడి పరుగులు
నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ఏకంగా రూ.270 పెరిగింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధరలు కూడా అదే బాటలో పయనించాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.294 మేర పెరగడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో ఈ ధరల ప్రభావం స్పష్టంగా కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,700 పెరగడంతో ప్రస్తుతం రూ.85,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింత భారీగా పెరిగింది. రూ. 2,900 మేర పెరగడంతో నేడు రూ.93,380 వద్ద కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

gold-prices-today-check-city-wise-rates

హైదరాబాద్ , విజయవాడలో బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.9,338 పెరిగి రూ.93,380 కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.8,560 పెరిగి రూ.85,660 వద్ద కొనసాగుతోంది. అటు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు పట్టణాల్లో ఇంచుమించు ఇదే ధర కొనసాగుతుంది. ఈ ధరలు పెరుగుదల బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే.

బెంగళూరు, చెన్నైలో ఇలా..
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దక్షిణాది నగరాలైన చెన్నై, గోవాలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,338 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,560 వద్ద ఉంది. అలాగే గోవాలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,338 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,560 గాను కొనసాగుతోంది.బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.9,330 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,560 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబైలో గోల్డ్ ధరలు

దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు మంట పుట్టించాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,353 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,575 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,338 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,560 గాను నమోదైంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,343 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,565 వద్ద ట్రేడ్ అవుతోంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఈ నగరంలో కూడా బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,353 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,575 వద్ద కొనసాగుతోంది. భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,338 గా నమోదవగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,560 వద్ద ఉంది.

వెండి ధరలు కూడా పరుగులు!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1,04,000 లకు చేరింది. గ్రాము వెండి నిన్నటి ధరతో పోల్చితే నేడు రూ. 2 పెరిగింది. అంటే కేజీకి ఏకంగా రూ. 2 వేలు పెరిగినట్లయింది. వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరింత భారంగా మారనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.95,000 వద్ద కొనసాగుతోంది.

ధరల పెరుగుదలకు కారణాలేంటి?
బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు 90 రోజులు వాయిదా వేశారు. డాలర్ మారకం విలువ పెరగడం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడం వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని మదుపరులు ఎంచుకుంటున్నారని అంటున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా పెళ్లిళ్ల సీజన్, పండుగలు కూడా దగ్గర పడుతుండటంతో దేశీయంగా కూడా బంగారం కొనుగోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు మరింత ఊతమిచ్చిందని భావిస్తున్నారు.

సామాన్యుడికి మరింత భారం!
ఏది ఏమైనా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం సామాన్యుడికి మాత్రం పెనుభారంగా మారింది. గతంలో బంగారం కొనాలనుకున్న వారు ఇప్పుడు ధరలు చూసి వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. మధ్యతరగతి, పేద ప్రజలు బంగారం కొనడం కలగానే మిగిలిపోతుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ధరలు ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+