Gold: ఏ లెవెల్ వద్ద కొంటే లాభమో తెలుసుకోండి!
ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు అనిశ్చితి మధ్య దోబూచులాడుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో పాటు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలను తీవ్ర హెచ్చుతగ్గులకు గురిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమీకరణాలు వేగంగా మారిపోయాయి.
ఆ తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్, మరోసారి 10 శాతం సుంకాల దాడిని ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ వాణిజ్య ఉద్రిక్తతలు పసిడి, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన ఇంధనంగా మారుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను విశ్లేషిస్తే, బంగారం ధరలు అంతర్లీనంగా 'బుల్లిష్' (పెరుగుదల) దిశగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Gold రేటు ప్రభావితం..
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడిదారులు ప్రస్తుతం కీలక సాంకేతిక స్థాయిలను గమనించడం చాలా అవసరం. గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 5,000 డాలర్ల మైలురాయిని దాటడం విశేషం. అమెరికాలో ద్రవ్యోల్బణం (CPI) అంచనాల కంటే తక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలపడ్డాయి. దీనివల్ల ట్రెజరీ యీల్డ్స్ తగ్గి, వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడిదారుల మక్కువ పెరిగింది.
వెండికి కూడా..
మరోవైపు, హార్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ చర్చల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సేఫ్ హేవెన్'గా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు. వెండికి కూడా పారిశ్రామికంగా, పెట్టుబడి పరంగా భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు COMEX వాల్ట్‌ల నుంచి 50 మిలియన్ ఔన్సుల వెండి బయటకు వెళ్లడం దీనికి నిదర్శనం. చైనా మార్కెట్లు తిరిగి ప్రారంభం కావడం, అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (PPI) వంటి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయి.
సమ్మెట్రికల్ ట్రయాంగిల్..
సాంకేతికంగా చూస్తే, గోల్డ్ మినీ ఫ్యూచర్స్ ప్రస్తుతం ఒక ఏకీకరణ (Consolidation) దశలో ఉన్నాయి. చార్టుల ప్రకారం సుమారు రూ. 1,58,000 స్థాయి వద్ద 'సమ్మెట్రికల్ ట్రయాంగిల్' ప్యాటర్న్ ఏర్పడుతోంది. ధర రూ. 1,53,000 పైన స్థిరంగా ఉండటం సానుకూల అంశం. ఒకవేళ ధర రూ. 1,58,000 దాటితే సరికొత్త గరిష్టాలకు చేరుకోవచ్చు. అయితే, రూ. 1,52,000 స్థాయి దిగువకు పడిపోతే మాత్రం కొంత దిద్దుబాటు (Correction) జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ. 1,58,000 వద్ద తక్షణ నిరోధం ఉండగా, రూ. 1,45,000 మరియు రూ. 1,40,000 స్థాయిలు బలమైన మద్దతుగా పనిచేస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!











Click it and Unblock the Notifications