బంగారం ప్రియులకు గుడ్ న్యూస్
ప్రపంచ ఆర్థిక పరిణామాలు, దేశీయ మార్కెట్లలో జరుగుతున్న హెచ్చుతగ్గులు మీ బంగారం కొనుగోలు ప్రణాళికలను ప్రభావితం చేయనున్నాయి. బంగారం ధరలు మళ్లీ ఆల్-టైమ్ రికార్డుల వైపు దూసుకుపోతుండగా, ఈ పసిడి పరుగు ఎక్కడ ఆగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం మార్కెట్ తాజా పరిస్థితులు, బుధవారం ధరల కదలికలపై ఓ లుక్కెద్దాం.
బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి దగ్గరగా ట్రేడవుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ, జూలై 16, బుధవారం నాటికి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,760గా ఉంది, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,440 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 1,24,000కు చేరుకుంది.

బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు ఇంత భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ కారణాలున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ తగ్గడం ఒక ప్రధాన కారణం. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం సురక్షిత పెట్టుబడిగా మారి, దాని డిమాండ్ పెరుగుతుంది. అలాగే, స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయించడానికి కారణమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ పెరగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు కూడా దీనికి తోడ్పడుతున్నాయి.
మరోవైపు, వెండి ధరలు రోజురోజుకూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వెండికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్, ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు (ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ వంటివి) దాని వినియోగం పెరగడం వెండి ధర పెరుగుదలకు ముఖ్య కారణాలు. ఈ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయిల దగ్గర ట్రేడవుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications