అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు- గందరగోళం
జనవరిలో రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విధాన నిర్ణయాలు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అస్థిరత, ప్రపంచ మార్కెట్ పరిణామాలు.. కొనుగోలుదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. అయోమయానికి, గందరగోళానికి దారి తీస్తోన్నాయి. అధిక స్థాయిలలో లాభాల స్వీకరణ కారణంగా ధరలు పడిపోతోండటం కొనాలా? వద్దా అనే డోలాయమాన పరిస్థితులకు తెర తీశాయి.
పెట్టుబడిదారులు దేశీయ విధాన సంకేతాలు, ప్రపంచ మార్కెట్ కదలికల మిశ్రమానికి ప్రతిస్పందించడంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులు చూపుతున్నాయి. ఇదే పరిస్థితి మరి కొన్ని రోజుల పాటు కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. గత నెలలో బంగారం అపూర్వ స్థాయిలకు చేరిన తర్వాత ధరల్లో ఈ తగ్గుదల కనిపించింది. జనవరి 29న 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,000 ఆల్-టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కుప్పకూలింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,52,500కి తగ్గింది.

MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రోజువారీ అస్థిరతను చవి చూసింది. శుక్రవారం నాడు, ఆర్‌బీఐ తన పాలసీ రెపో రేటును 5.25 శాతంగా మార్చకుండా ఉంచాలని నిర్ణయించింది. ఆ తర్వాత MCX బంగారం ధరలు రూ. 1,55,499.00 వద్ద ముగిసి, రూ. 3,428 (2.25 శాతం) పెరుగుదలను నమోదు చేశాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గాయి. ఫ్యూచర్స్ మొదట్లో బలహీనతను ప్రదర్శించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పాలసీ స్పష్టత తర్వాత వ్యాపారులు తమ స్థానాలను సర్దుబాటు చేయడంతో ధరలు స్థిరపడ్డాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,731, 22 క్యారెట్లు - రూ. 14,420, 18 క్యారెట్లు - రూ. 12,350
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications