పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- ఏం జరుగుతోంది
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్లలో మందగించిన డిమాండ్ ఇందుకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,54,910 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్లు 10 గ్రాములకు 1,42,000 రూపాయల వద్ద లభించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధర పతనమైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో 0.78 శాతం మేర తగ్గింది. 10 గ్రాములకు 1,53,548కి చేరింది.
అదే సమయంలో వెండి ధర 1.62 శాతం తగ్గి కిలో 2,36,000 రూపాయల వద్దకు చేరుకుంది. గత నెలలో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,80,000 రూపాయల మార్కును అధిగమించింది. వెండి కిలో 4,20,00 రూపాయల వద్ద చారిత్రక గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత పతనం మొదలైంది. నేటికీ కొనసాగుతోంది. ఈ రికార్డు గరిష్టాల తర్వాత ప్రస్తుతం ధరలు తగ్గుదల ధోరణిని చూపుతున్నాయి. ల్యూనార్ ఇయర్ కారణంగా మార్కెట్లు మూతపడటమే దీనికి కారణం.

ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,900గా నమోదైంది. అదేవిధంగా, ఈ నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ. 1,54,600 వద్ద లభించింది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,42,000, 24 క్యారెట్లు రూ. 1,54,910గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,622, 22 క్యారెట్లు - రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 12,250
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618
-
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications