పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన ప్రభావం బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. వీటి రేట్లల్లో నేడు పెరుగుదల కనిపించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం భయాలు, ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశాయి. ఈ అనిశ్చితి మధ్య, బంగారం, వెండి ధరలు దాదాపు 0.60 శాతం వరకు పెరిగాయి.
అంతర్జాతీయంగా కామెక్స్ లో స్పాట్ బంగారం ధర 0.6 శాతం తగ్గి ఔన్స్‌కు 4,718.98 డాలర్ల వద్ద వద్ద స్థిరపడింది. అస్థిరత నేపథ్యంలో కొనుగోలుదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎగబడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ఇన్వెస్ట్ చేస్తోన్నారు. దీని ప్రభావం కూడా రేట్ల పెరుగుదలకు కారణమైంది.

ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.5 శాతం తగ్గి, 10 గ్రాములకు రూ. 1,51,900 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర 1.97 శాతం పడిపోయి కిలోకు రూ. 2,38,486కి చేరింది. ముంబైలో వెండి స్పాట్ ధర కిలోకు రూ. 2,60,000గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,52,830, 22 క్యారెట్లు రూ. 1,40,090 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,52,980, 22 క్యారెట్లు రూ. 1,40,240గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,513, 22 క్యారెట్లు - రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,865
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,393, 22 క్యారెట్లు- రూ. 14,110, 18 క్యారెట్లు - రూ. 11,545
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,393, 22 క్యారెట్లు- రూ. 14,110, 18 క్యారెట్లు - రూ. 11,545
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,393, 22 క్యారెట్లు- రూ. 14,110, 18 క్యారెట్లు - రూ. 11,545
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,393, 22 క్యారెట్లు- రూ. 14,110, 18 క్యారెట్లు - రూ. 11,545
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,393, 22 క్యారెట్లు- రూ. 14,110, 18 క్యారెట్లు - రూ. 11,545

Click it and Unblock the Notifications