అంచనాలు తలకిందులు చేసిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఒక్కసారిగా ఎగబాకాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే రెండు శాతం వరకు వీటి రేట్లల్లో పెరుగుదల కనిపించింది. ఇక ఇప్పట్లో తగ్గే పరిస్థితులు లేకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, దేశీయ డిమాండ్ అలాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
స్థానిక, ప్రపంచ మార్కెట్లలోని హెచ్చుతగ్గులు బంగారం ధరలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. నేడు మల్టీ కమోడిటీ ఎక్స్సేంజీలో బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. దాదాపు 3,000 రూపాయల మేర పెరిగాయి. 10 గ్రాములకు రూ. 1,45,500కి చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ అయిదు శాతం అంటే రూ. 13,550 కు పైగా ఎగిసింది. కిలోకు రూ. 3,01,315 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. భౌగోళిక-రాజకీయపరమైన ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,673, 22 క్యారెట్లు - రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,230
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,569, 22 క్యారెట్లు- రూ. 13,355, 18 క్యారెట్లు - రూ. 10,927
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,569, 22 క్యారెట్లు- రూ. 13,355, 18 క్యారెట్లు- రూ. 10,927
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,569, 22 క్యారెట్లు- రూ. 13,355, 18 క్యారెట్లు- రూ. 10,927
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,569, 22 క్యారెట్లు- రూ. 13,355, 18 క్యారెట్లు- రూ. 10,927
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,569, 22 క్యారెట్లు- రూ. 13,355, 18 క్యారెట్లు- రూ. 10,927

Click it and Unblock the Notifications