Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పల్సర్, అపాచీలకు నిద్ర పట్టదు! ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి హీరో కొత్త బైక్ !

బైకులంటే యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పుడు కేవలం సాధారణ బైకులకు మాత్రమే పరిమితం కాకుండా యువతను ఆకర్షించే ప్రీమియం మార్కెట్‌పై దృష్టి సారించింది. 160సీసీ సెగ్మెంట్‌లో అపాచీ, పల్సర్ వంటి ప్రత్యర్థులకు గట్టీ పోటీ ఇచ్చేందుకు హీరో.. తన పాపులర్ మోడల్ ఎక్స్‌ట్రీమ్ 160Rలో సరికొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అత్యుత్తమ స్పోర్ట్స్ నేకెడ్ బైక్ అయిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160Rకు అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించింది. క్రూయిజ్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రాటిల్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,34, 100గా నిర్ణయించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ.4,500 అధికం. కానీ ఈ అద్భుత ఫీచర్లు 160 సీసీ సెగ్మెంట్ లో ఇంతవరకు ఏ బైకులోనూ లేకపోవడం గమనార్హం.

160సీసీ సెగ్మెంట్ లో రైడింగ్ మోడ్స్ ను అందిస్తున్న తొలి బైక్ ఇదే కావడం ఈ కొత్త వేరియంట్ ప్రత్యేకత. బైక్ రైడర్లు తమకు అనుకూలంగా రెయిన్, రోడ్, స్పోర్ట్స్ అనే మూడు మోడ్స్‌‌ను ఎంచుకోవచ్చు. హ్యాండిల్‌బార్స్‌పై కొత్తగా అమర్చిన స్విచ్‌ల ద్వారా ఈ మోడ్స్‌ను, క్రూయిజ్ కంట్రోల్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అయితే ఇందులో కూడా పాత మోడల్ లో ఉన్న 163.2సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్‌నే ఇందులోనూ కొనసాగించారు. ఈ బైక్ 8,500rpm వద్ద 16.9hp శక్తిని, 6,500rpm వద్ద 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.డిజైన్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఎక్స్‌ట్రీమ్ 250R నుంచి స్ఫూర్తి పొందిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.2-అంగుళాల కలర్డ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, తాజా గ్రాఫిక్స్, నాలుగు కొత్త రంగుల ఆప్షన్స్‌తో ఈ బైక్ స్పోర్టీ లుక్‌ను సొంతం చేసుకుంది. హార్డ్‌వేర్ విషయానికి వస్తే మెరుగైన సస్పెన్షన్ కోసం ముందువైపు KYB USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్ యూనిట్‌ను ఇచ్చారు. బ్రేకింగ్ భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) సపోర్ట్‌తో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, ఇది రైడర్‌కు గరిష్ట భద్రతను అందిస్తుంది.

Hero Launches New Xtreme 160R 4V Premium Features Challenge Pulsar and Apache

ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,29,500 కాగా.. అన్ని ఫీచర్లు ఉన్న కాంబ్యాట్ ఎడిషన్ ధర రూ.1,34,000 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌లోని అతిపెద్ద ప్రత్యేకత దాని రైడ్-బై-వైర్ థ్రోటల్ సిస్టమ్. అంటే, ఇందులో సాధారణ యాక్సిలరేటర్ కేబుల్ ఉండదు. బదులుగా, బైక్ వేగాన్ని, ప్రతిస్పందనను సెన్సార్ల ద్వారా ఎలక్ట్రానిక్‌గా నియంత్రించడం జరుగుతుంది. దీనికి తోడు సుదూర ప్రయాణాలకు అత్యంత సౌకర్యాన్ని ఇచ్చే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా అందించారు.

సాధారణంగా దైనందిన ప్రయాణాలకు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అంతగా ఉపయోగపడకపోయినా, ఈ ఫీచర్‌ను అందించడం బైక్‌కు బలమైన ప్రీమియం ఇమేజ్‌ను ఇస్తుంది. ఇంత అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇంత తక్కువ ధరలో అందించడం ద్వారా, హీరో 160cc నేకెడ్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో టీవీఎస్, బజాజ్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కాంబ్యాట్ ఎడిషన్‌లో బ్రోన్జ్/బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్/నియాన్ గ్రీన్, రెడ్ యాక్సెంట్‌తో కూడిన బ్లాక్, మ్యాట్ గ్రే షేడ్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ మార్కెట్లో తుఫాన్ సృష్టించడం ఖాయమని అనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+