కుప్పకూలిపోయిన వెండి ధరలు: ఒకేసారి రూ. 85,000 లకు పైగా ఢమాల్..!!
దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శుక్రవారం నాటితో పోల్చుకుంటే వెండి ధరలు దాదాపు 30 శాతం మేర పడిపోయాయి. కిలో 3,00,000 రూపాయలకు దిగువకు చేరింది. 1980ల తర్వాత ఇదే అతిపెద్ద పతనం. బలహీన అంతర్జాతీయ ట్రెండ్స్, బలపడిన అమెరికన్ డాలర్ కారణంగా ఇన్వెస్టర్లు భారీ లాభాలను బుక్ చేసుకున్నారు. భారీగా విక్రయించారు. దీంతో మార్కెట్ అమ్మకాలతో వణికిపోయింది.
ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ వద్ద కిలో వెండి 2,91,922 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. గురువారం నాడు నాలుగు లక్షల రూపాయల రికార్డు స్థాయికి చేరిన వెండి ధరలు.. సరిగ్గా రెండంటే రెండు రోజుల్లోనే లక్ష రూపాయలకు పైగా తగ్గింది. ఈ ఒక్క రోజులోనే 85,000 రూపాయల మేర పతనం కనిపించింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఈ ఉదయం కిలో 2,91,000 రూపాయల కంటే దిగువకు ట్రేడ్ కావడం కనిపించింది., ఒక దశలో 2,91,922 రూపాయల వద్దకు వెళ్లినా మళ్లీ తగ్గింది.

స్పాట్ వెండి 12.09 శాతం అంటే దాదాపు 14 డాలర్ల మేర తగ్గుముఖం పట్టింది. ఔన్స్‌కు 101.47 డాలర్లకు చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇది 17.5 శాతం వరకు పతనం కావడం ఓ రికార్డే. ఒక్కరోజులో ఈ స్థాయిలో పతనం కావడం అనేది 1980ల్లో సంభవించింది. గురువారం నాడు వెండి ఔన్స్‌కు 121.45 డాలర్లతో సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. రెండు రోజుల్లో దీని ధర ఔన్స్‌కు 101.47 డాలర్లకు చేరింది.
ఈ పరిణామాలపై కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ విభాగాధిపతి కైనత్ చైన్‌వాలా మాట్లాడారు. లాభాల స్వీకరణ నేపథ్యంలో అటు బంగారం గానీ, వెండి ధరలు గానీ తగ్గుముఖం పట్టాయని, బంగారం ఔన్స్‌కు 5,100 డాలర్లు, వెండి 101 డాలర్ల కంటే దిగువకు పడిపోవడానికి ఇదే ప్రధాన కారణమని అంచనా వేశారు. సురక్షిత పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
-
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్‌లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications