అంచనాలకు మించి దూసుకెళ్లిన భారత ఆర్థిక వ్యవస్థ!

India Q2 GDP: భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి(జులై నుంచి సెప్టెంబర్) సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటుతో పెరిగింది. బలమైన వినియోగదారుల వ్యయం (కన్స్యూమర్ స్పెండింగ్), పటిష్టమైన తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్) కారణంగా వృద్ధి రేటులో ఈ పెరుగుదల నమోదైంది.

నామినల్ జీడీపీ వృద్ధి 8.7 శాతం
ప్రపంచ వాణిజ్యంలో అధిక అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఈ జీడీపీ వృద్ధిని సాధించింది. దీనికి ముందు త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నామినల్ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు) రియల్ జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఇది 6.1 శాతంగా ఉంది.

India Q2 GDP Growth Surpasses Expectations Economy Expands 8 2

రంగాల వారీగా వృద్ధి రేటు
*తయారీ రంగం - 9.1 శాతం
*నిర్మాణ రంగం -7.2 శాతం
*ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు- 10.2 శాతం
*వ్యవసాయం, సంబంధిత రంగాలు - 3.5 శాతం
*విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు -4.4 శాతం

తయారీ , సేవా రంగాల అద్భుత ప్రదర్శన
భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు తయారీ రంగం, సేవా రంగంలోని బలమైన వృద్ధి నాయకత్వం వహించిందని స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీవీఏ (Gross Value Added) వృద్ధి 8.1 శాతంగా నమోదైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ విభాగంలో రెండంకెల జీవీఏ వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయం, సంబంధిత రంగాలలో మాత్రం కొద్దిగా నెమ్మదైన వృద్ధి నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+