నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ మార్జిన్లు
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు దిగుమతి సగటు ధర బ్యారెల్‌కు రికార్డు స్థాయికి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా 120 శాతం పెరిగిగాయి. ఒక దశలో బ్యారెల్ ముడిచమురు 156.29 డాలర్లు పలికింది. యుద్ధానికి ముందు ఫిబ్రవరి 28న 71.17గా డాలర్లుగా ఉన్న ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ధర మార్చి 9 నాటికి 120.28 డాలర్లకు చేరింది. 16న 140, 19న 156.29 డాలర్లను తాకింది.
అదే రోజున 108.65 వద్ద ఉన్న బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్‌ను అధిగమించి, ఇండియన్ బాస్కెట్ కొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఇండియన్ బాస్కెట్ బ్రెంట్ కంటే తక్కువగా ఉండేది. 2008 జూలై 3న ఇండియన్ బాస్కెట్ 142, బ్రెంట్ 146 డాలర్ల వద్ద నమోదైంది. ప్రస్తుతం వీటి ధరలు బ్రెంట్ కంటే పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచట్లేదు. అధిక ఇన్పుట్ ఖర్చులను భరిస్తున్నాయి. ఫలితంగా వాటి లాభాల మార్జిన్లు భారీగా పడిపోతున్నాయి. లాభాలు తగ్గడం, నష్టాల దిశగా సాగుతోండటం ఆందోళనకంగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో మొత్తం రిఫైనింగ్ ఖర్చులలో దాదాపు 90 శాతం వాటాతో ముడి చమురు కీలక పాత్ర పోషిస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయడం ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించింది. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రిటైల్ ఔట్‌లెట్‌లలో ఇంధనం కొరత లేదని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరా ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటోంది.
వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications