Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లుడి కోసం దేశంలోనే ఫస్ట్ టెస్లా కారు కొన్న మంత్రి!

Tesla: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇండియాలో మొదటి టెస్లా కారు డెలివరీ అయింది. ఈ చరిత్రాత్మక క్షణానికి మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ సాక్షిగా నిలవడం గమనార్హం. పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ మంత్రి ఈ కారును తన అల్లుడికి బహుమతిగా ఇచ్చారు.

దేశంలో తొలి యజమానిగా మంత్రి ప్రతాప్ సర్నాయక్
టెస్లా మోడల్ 'వై' కారును డెలివరీ తీసుకున్న తర్వాత మంత్రి ప్రతాప్ సర్నాయక్ మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. " రవాణా శాఖ మంత్రిగా భారతదేశంలోనే మొదటి టెస్లా కారును కొనుగోలు చేసే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ టెస్లా కారును నేను నా అల్లుడి కోసం కొనుగోలు చేశాను. దీనివల్ల ప్రజల్లో పర్యావరణ అనుకూల వాహనాలపై అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాను." అని ఆయన అన్నారు.

India s First Tesla Delivered Maharashtra Minister Gifts Model Y to Son-in-Law

తమ ప్రభుత్వం పర్యావరణ అనుకూల కార్లను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి కృషి చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. "కారు కొనగలిగే ఆర్థిక స్థోమత ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కార్లలో పాఠశాలకు తీసుకెళ్తే.. పిల్లలు వాటి గురించి ఇతరులతో చర్చిస్తారు. దీనివల్ల ఈ వాహనాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగి, ఎక్కువ మంది పర్యావరణ అనుకూల కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు" అని మంత్రి ప్రతాప్ సర్నాయక్ అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. లక్ష్యాలు
మహారాష్ట్ర సర్కారు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. రాబోయే పదేళ్లలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం వాహనాల తయారీ సంస్థలకు, యజమానులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రాజకీయ నాయకుడి పర్యావరణ స్పృహను చాటుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+