వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్యూ2: మంచి లాభాలు సాధించిన ఇన్ఫోసిస్, రూ.4వేల కోట్ల నికర లాభాలు
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండవ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 10.3శాతం లాభాల వృద్ధిని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6-8శాతం వుంటుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలకు మించి ఈ ఆర్థికసంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ. 4,110 కోట్ల నికర లాభాలాను సాధించింది.

ఆదాయం 17.30 శాత ఎగిసి 20,609 కోట్ల రూపాయలను సాధించింది. కోఆపరేటింగ్ మార్జిన్లు 23.7శాతంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఈక్విటీ షేరుకు 7రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అక్టోబరు 30 తరువాత డివిడెండ్ చెల్లింపు ఉంటుందని వెల్లడించింది.
English summary
IT giant Infosys on Tuesday reported a 10.30 per cent YoY rise in profit at Rs 4,110 crore for the September quarter, largely in line with Rs 4,048 crore net predicted by analysts in an ET NOW poll.
Story first published: Tuesday, October 16, 2018, 17:43 [IST]



Click it and Unblock the Notifications
