కథ మళ్లీ మొదటికి- పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. రికార్డు స్థాయిలో పతనమైన మరుసటి రోజే క్రూడ్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు తొమ్మిది శాతం మేర పెరుగుదల కనిపించింది. 2020 తర్వాత అత్యంత భారీ ఇంట్రాడే పతనాన్ని చవిచూసిన ముడిచమురు ధరలు ఆ వెంటనే తిరిగి పుంజుకోవడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే భయాలు ఈ ధరల కదలికలకు ప్రధాన కారణాలు.
అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భారతీయ చమురు కంపెనీలు సామాన్య వినియోగదారులపై అదనపు భారాన్ని మోపట్లేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా ఇతర నగరాల్లో నేటి ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. సాధారణ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇదివరకే పారిశ్రామిక డీజిల్ ధరను 25 శాతం మేర పెంచాయి.

దీంతో బల్క్ కొనుగోలుదారులకు ఇప్పుడు లీటరు రూ. 137.81 చెల్లించాల్సి వస్తోంది. ఇది మునుపటి ధర కంటే రూ. 28.22 అధికం. అయిదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. చమురు కంపెనీలు రిఫైనరీల నుండి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి నిర్ణయించాయి. ఈ చర్య చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తగ్గించి, వినియోగదారుల ధరలను స్థిరంగా ఉంచుతోంది.
నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది..












Click it and Unblock the Notifications