ఐఫోన్ 17 బదులు .. 5 అదిరిపోయే బైక్స్ కొనొచ్చని మీకు తెలుసా..?
టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (2టీబీ వేరియంట్) ధర రూ. 2.30 లక్షలు. ఈ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయాలా అని ఆలోచించేవారికి, అదే మొత్తంలో లేదా అంతకంటే తక్కువ ధరకే మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన కొత్త బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వానికి సరిపోయే ఒక స్టేట్‌మెంట్.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350: భారతీయ రోడ్లపై ఒక ఐకాన్‌గా నిలిచిన ఈ బైక్, దాని రెట్రో లుక్ మరియు 'డుగ్ డుగ్' సౌండ్‌తో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. పండగ ఆఫర్లతో దీని ధర రూ. 1.81 లక్షల నుంచి రూ. 2.16 లక్షల మధ్య ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో తక్కువ ధరకే స్టైలిష్ బైక్ కావాలంటే హంటర్ 350 ఒక మంచి ఎంపిక. దీని ధర రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.67 లక్షల మధ్య అందుబాటులో ఉంది.
కేటీఎం 250 డ్యూక్: పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే యువతకు కేటీఎం 250 డ్యూక్ సరైన ఎంపిక. స్పోర్టీ డిజైన్, వేగవంతమైన పనితీరు కారణంగా దీనిని 'పాకెట్ రాకెట్' అని పిలుస్తారు. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.12 లక్షలు మాత్రమే.
హోండా ఎన్ఎక్స్200: నగర ప్రయాణాలకు, అప్పుడప్పుడు చిన్న టూర్లకు వెళ్లేవారికి హోండా ఎన్ఎక్స్200 ఒక మంచి ఆప్షన్. దీని ధర కేవలం రూ. 1.70 లక్షలు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310: ట్రాక్‌పై రేసింగ్ అనుభూతిని కోరుకునే వారికి ఈ బైక్ సరైనది. జీఎస్టీ ప్రయోజనాలతో దీని ధర రూ. 2.21 లక్షలుగా ఉంది.
మొత్తం మీద, ఒక స్మార్ట్‌ఫోన్‌పై లక్షలు ఖర్చు చేసే బదులు, అదే ధరలో ప్రయాణ అవసరాలను తీర్చే ఒక మంచి బైక్‌ను కొనుగోలు చేయడం తెలివైన ఎంపిక అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications