ఆఫ్-రోడింగ్‌లో అసలైన 'బాహుబలి'.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!
KTM 390 Adventure R: అడ్వెంచర్ బైకుల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేటీఎం.. భారత్‌లో తన సరికొత్త మోడల్ 390 Adventure Rను లాంచ్ చేసింది.ఈ కొత్త మోడల్ ఆఫ్-రోడింగ్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా.. సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. గత మోడళ్లతో పోలిస్తే ఇది మరింత శక్తివంతంగా ఉండటమే కాకుండా.. ధర విషయంలో కూడా వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఉంది.
శక్తివంతమైన ఇంజన్.. పెర్ఫార్మెన్స్
'కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్' బైక్‌లో 398.63సీసీ సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ DOHC ఇంజన్‌ను అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 46 PS గరిష్ట శక్తిని, 6,500 rpm వద్ద 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ కేవలం రోడ్లపైనే కాకుండా, కఠినమైన కొండ ప్రాంతాలు, మట్టి దారుల్లో కూడా బైక్ వేగంగా దూసుకుపోయేలా చేస్తుంది. దీనికి జత చేసిన 6-స్పీడ్ గేర్ బాక్స్ వేగాన్ని, పవర్‌ను చక్కగా నియంత్రిస్తుంది, తద్వారా ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది.

అడ్వెంచర్ కోసం ప్రత్యేకమైన డిజైన్
ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య రాళ్లు, గుంతలు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేటీఎమ్ ఈ బైక్‌కు 272మిల్లీమీటర్ల హై గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందించింది. దీనివల్ల బైక్ అడుగుభాగం నేలకు తగిలే ప్రమాదం ఉండదు. అలాగే ఇందులో సర్దుబాటు చేసుకోగలిగే సస్పెన్షన్లు ఉన్నాయి. ఇవి 230మిల్లీమీటర్ల వరకు కుంచించుకుపోయి పెద్ద పెద్ద కుదుపులను కూడా సులభంగా తట్టుకోగలవు. బురద, మట్టి దారుల్లో అద్భుతమైన గ్రిప్ కోసం ఇందులో ముందు 21 అంగుళాలు, వెనుక 18 అంగుళాల స్పోక్ వీల్స్, నాబీ టైర్లను ఉపయోగించారు.
అధునాతన టెక్నాలజీ, భద్రత
సాంకేతికత పరంగా కూడా ఈ బైక్ ఎంతో ముందుంది. ఇందులో 5-అంగుళాల కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసి కాల్స్ స్వీకరించడం, మ్యూజిక్ ప్లే చేయడం, గమ్యస్థానానికి వెళ్లేందుకు నావిగేషన్‌ను చూసుకోవడం వంటివి చేయవచ్చు. భద్రత కోసం ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులతో పాటు 'ఆఫ్-రోడ్ ఏబీఎస్' సౌకర్యం ఉంది. జారుడుగా ఉండే రోడ్లపై వెనుక చక్రాన్ని అదుపు తప్పకుండా ఉంచేందుకు ఈ ఫీచర్ ఎంతో సహాయపడుతుంది. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ధర, లభ్యత వివరాలు
ధర విషయానికి వస్తే. 'కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్' ఎక్స్-షోరూమ్ ధర రూ. 3,77,915గా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ బైక్ పాత మోడల్ కంటే దాదాపు రూ. 20,000 తక్కువ ధరకే లభిస్తోంది. ట్యూబ్ టైర్లను వాడటం వల్ల తయారీ వ్యయం తగ్గి ఈ మేర ధర తగ్గినట్లు తెలుస్తోంది. కేటీఎమ్ సిగ్నేచర్ ఆరెంజ్ కలర్ ఫ్రేమ్‌తో స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్, తక్కువ బడ్జెట్‌లో ప్రొఫెషనల్ ర్యాలీ బైక్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications