వామ్మో.. కోతి ధర ఇన్ని లక్షలా? ఆకాశాన్నంటుతున్న డిమాండ్.. కారణం ఇదే!

సాధారణంగా ఏదైనా వస్తువు ధర పెరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ చైనాలో ప్రయోగశాల కోతుల ధరలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చైనాలో బయోటెక్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో కొత్త ఔషధాల పరీక్షల కోసం వినియోగించే కోతుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం అక్కడ ఒక్కో కోతి ధర చైనా సగటు ఉద్యోగి వార్షిక జీతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఒక్కో కోతి విలువ రూ.16.30 లక్షలు
తాజా గణాంకాల ప్రకారం.. ప్రయోగశాలల్లో ఔషధ పరీక్షల కోసం ఉపయోగించే ఒక్కో 'సినోమోల్గస్ మకాక్' ధర సుమారు 1.40 లక్షల యువాన్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 16.30 లక్షలు. కేవలం ఐదేళ్ల క్రితం అంటే 2021లో వీటి ధర 70,500 యువాన్లు మాత్రమే ఉండేది. అంటే అతి స్వల్ప కాలంలోనే వీటి ధరలు రెట్టింపు అయ్యాయి. చైనా జాతీయ గణాంకాల బ్యూరో ప్రకారం.. అక్కడ ఒక సగటు ఉద్యోగి వార్షిక వేతనం 1,02,452 యువాన్లు. అంటే ఒక సాధారణ ఉద్యోగి ఏడాది పొడవునా కష్టపడి సంపాదించే మొత్తం కంటే ఒక ప్రయోగశాల కోతి ధరే దాదాపు 40 వేల యువాన్లు ఎక్కువగా ఉంది.

Lab Monkey Prices Surge in China Single Monkey Costs More Than Average Annual Salary Full Details

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
చైనా బయోటెక్ కంపెనీలు ప్రపంచ ఫార్మా దిగ్గజాలతో కుదుర్చుకుంటున్న భారీ ఒప్పందాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గతేడాది సుమారు 135.7 బిలియన్ డాలర్ల విలువైన 157 డ్రగ్ లైసెన్సింగ్ ఒప్పందాలు జరిగాయి. ఏదైనా కొత్త మందును లేదా వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ముందు, అది ఎంతవరకు సురక్షితం? శరీరం దానిని ఎలా స్వీకరిస్తోంది? వంటి అంశాలను తెలుసుకోవడానికి కోతులపై పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. అంతర్జాతీయంగా బయోటెక్ రంగానికి నిధుల వెల్లువ పెరగడంతో కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది, ఫలితంగా కోతుల అవసరం కూడా పెరిగింది.

డిమాండ్‌కు తగ్గని సరఫరా
ఔషధ పరీక్షల రూపకల్పనను బట్టి కోతుల వినియోగం ఉంటుంది. ఒక సాధారణ యాంటీబాడీ డ్రగ్ పరీక్షకు 70 నుంచి 100 కోతులు అవసరమవుతాయి. తక్కువ ప్రమాదం ఉన్న చిన్న స్థాయి మందులకైతే 40 నుంచి 60 కోతులు కావాలి. రాబోయే 2025-2027 మధ్య కాలంలో చైనాలో ఏడాదికి సుమారు 62,600 కోతుల అవసరం ఉంటుందని అంచనా. కానీ అక్కడ అందుబాటులో ఉన్న సరఫరా మాత్రం 52,000 లోపే ఉంది. కోతుల సంతానోత్పత్తి కేంద్రాలు ఇప్పటికే 2026 మొదటి త్రైమాసికం వరకు బుకింగ్‌లతో నిండిపోయాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సరఫరా-డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసం ధరలను మరింత పెంచుతోంది.

ముందు జాగ్రత్తలో ఫార్మా కంపెనీలు
కోతుల ధరల హెచ్చుతగ్గుల వల్ల ప్రాజెక్ట్ ఖర్చులు పెరగకుండా ఉండేందుకు ప్రధాన కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. WuXi AppTec అనే సంస్థ ఇప్పటికే ఒక కోతుల ఫారాన్ని కొనుగోలు చేసి 30,000 కోతులను తన ఆధీనంలో ఉంచుకుంది. అలాగే Joinn Laboratories అనే సంస్థ అమెరికాలోని ఫ్లోరిడాలో సుమారు 1,400 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ కోతుల క్వారంటైన్, పరీక్షా కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇలాంటి చర్యల ద్వారా భవిష్యత్తులో కోతుల కొరత ఏర్పడకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి.

మందుల ధరలపై ప్రభావం పడుతుందా?
కోతుల ధరలు భారీగా పెరిగినప్పటికీ, రోగులు కొనే మందుల ధరలపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఔషధ తయారీలో క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3 వరకు) అత్యంత ఖరీదైనవి. దీనికి ఐదు నుంచి పదేళ్ల సమయం, మిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చు అవుతుంది. మొత్తం డ్రగ్ డెవలప్‌మెంట్ బడ్జెట్‌లో 70 శాతం ఖర్చు చివరి దశ ట్రయల్స్‌కే అవుతుంది. కాబట్టి ప్రారంభ దశలో జరిగే ఈ జంతు పరీక్షల ధరల పెరుగుదల, అంతిమంగా మందుల ధరలను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+