LIC నుంచి కొత్త ప్లాన్స్: రూ.2 కోట్ల బీమాతో పాటు సేవింగ్స్ గ్యారెంటీ!

భారతీయ జీవిత బీమా సంస్థ 'LIC' తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త ప్లాన్లు 'ప్రొటెక్షన్ ప్లస్', 'బీమా కవచ్' (Bima Kavach). ఈ రెండు పథకాల ద్వారా జీవిత బీమాతో పాటు పొదుపు, ఆర్థిక భద్రతకు గ్యారెంటీ లభిస్తుంది. ఎల్ఐసీ తీసుకొచ్చిన ఈ కొత్త పథకాల లక్ష్యం.. ప్రజలకు సులభమైన, ప్రయోజనకరమైన, దీర్ఘకాలికంగా నమ్మకమైన పాలసీలను అందించడమే. తద్వారా కష్టకాలంలో బీమాదారుడికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ రెండు ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. LIC ప్రొటెక్షన్ ప్లస్
ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.. తమ బీమాతో పాటు కొంత పొదుపు చేయాలనుకునేవారు లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా నిధులను సిద్ధం చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్. ఇది కేవలం మరణ కవరేజీని మాత్రమే కాకుండా, పెట్టుబడి/యూనిట్ ఫండ్‌పై ఆధారపడిన ఫండ్ విలువను కూడా అందిస్తుంది. ఈ పథకం మీ డబ్బును మార్కెట్‌తో అనుసంధానిస్తుంది, దీని కారణంగా ఇది సాంప్రదాయ ఎల్ఐసీ పాలసీల కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. 18 నుండి 65 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి మీ ఇష్టం ప్రకారం 10, 15, 20 లేదా 25 సంవత్సరాలు ఎంచుకోవచ్చు.

LIC Launches New Insurance Plans Protection Plus and Bima Kavach with Coverage up to 2 Crore

ప్రీమియం చెల్లింపు కాలం 5, 7, 10 లేదా 15 సంవత్సరాల వరకు ఉంటుంది. కనీసం వార్షిక ప్రీమియంలో 5 నుంచి 7 రెట్లు సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. అదనపు ప్రీమియం చెల్లించి ఫండ్ విలువను పెంచుకునే సౌకర్యం ఉంది. ప్రీమియం ఏ పెట్టుబడి ఫండ్‌లోకి వెళ్లాలో పాలసీదారులు ఎంచుకోవచ్చు. పాలసీ ప్రారంభమైన 5 సంవత్సరాల తర్వాత ఫండ్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పాలసీదారు మరణిస్తే, నామినీకి సమ్ అష్యూర్డ్ + ఫండ్ విలువ లభిస్తుంది. పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత (పాలసీదారు జీవించి ఉంటే) యూనిట్-ఫండ్ విలువ లభిస్తుంది.

2. LIC బీమా కవచ్
ఎల్ఐసీ బీమా కవచ్ స్కీమ్ స్వచ్ఛమైన రిస్క్ ప్రొటెక్షన్ టర్మ్ లైఫ్ ప్లాన్. ఇది పెట్టుబడి లేదా పొదుపు అంశాలను కలిగి ఉండదు, కానీ పాలసీదారు మరణించినప్పుడు వారి కుటుంబానికి లేదా నామినీకి స్థిరమైన మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. 18 నుంచి 65 సంవత్సరాల లోపు వారు ఈ పథకాన్ని తీసుకోవచ్చు. పాలసీ వ్యవధి ప్రకారం లేదా గరిష్టంగా 100 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది.

పాలసీ వ్యవధి అంతా ఒకే విధంగా ఉండే లెవెల్ సమ్ అష్యూర్డ్ లేదా కాలక్రమేణా పెరుగుతూ ఉండే ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఈ పాలసీ కింద కనీసం రూ.2 కోట్ల సమ్ అష్యూర్డ్ అందించబడుతుంది. ఈ స్కీంలో ప్రీమియం ఒకేసారి సింగిల్ పేమెంట్ లేదా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 5,10,15 ఏళ్లుగా ఎంచుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ ఆధారంగానే కనీస పాలసీ టర్మ్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+