మేడ్ ఇన్ ఇండియా:ప్రపంచానికి మన కోచ్‌లు,ఇంజిన్లు..!!

భారతీయ రైల్వే ,ఇప్పుడు కేవలం దేశీయ అవసరాలకే పరిమితం కావడం లేదు."మేక్ ఇన్ ఇండియా,మేక్ ఫర్ ది వరల్డ్"లక్ష్యంతో రైల్వే రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఎగుమతిదారుగా వేగంగా ఎదుగుతోంది.బోగీలు,రైలు కోచ్‌లు,ఇంజన్లు (లోకోమోటివ్‌లు)ఇంకా ప్రొపల్షన్ సిస్టమ్స్(Propulsion Systems)వంటి కీలకమైన రైల్వే పరికరాలను భారత్ నుంచే ప్రపంచానికి డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, అందిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ రైల్వే ఉత్పత్తులు
భారతదేశంలో తయారైన రైల్వే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ వృద్ధి భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం.

  • మెట్రో కోచ్‌లు: ఆస్ట్రేలియా, కెనడాలకు ఎగుమతి అయ్యాయి.
  • బోగీలు: యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చేరుతున్నాయి.
  • ప్రొపల్షన్ సిస్టమ్స్: ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీ సహా అనేక దేశాలకు సరఫరా అవుతున్నాయి.
  • ప్యాసింజర్ కోచ్‌లు: మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు అందిస్తున్నారు.
  • లోకోమోటివ్‌లు (ఇంజిన్లు): మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ గినియాకు ఎగుమతి అవుతున్నాయి.
made-for-the-world-indian-railways-becomes-global-exporter-of-locomotives-and-metro-coaches

మార్హౌరా ప్లాంట్ నుంచి గినియాకు లోకోమోటివ్స్
2025 జూన్‌లో ప్రధాని మోదీ బీహార్‌లోని మార్హౌరా లోకోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ గినియాకు ఎగుమతి కానున్న తొలి లోకోమోటివ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.ఇప్పటివరకు,ఈ మార్హౌరా ప్లాంట్‌లో తయారుచేసిన ఆరు లోకోమోటివ్‌లు విజయవంతంగా రిపబ్లిక్ ఆఫ్ గినియాకు చేరాయి.తాజాగా, ఈ ప్లాంట్ ఆఫ్రికా దేశాల కోసం దాదాపు 150 ఎవల్యూషన్ సిరీస్ లోకోమోటివ్‌ల ఎగుమతి కోసం మరో కీలకమైన ఆర్డర్‌ను దక్కించుకుంది.

ఈ ఎగుమతి చేసిన లోకోమోటివ్ 4,500 హెచ్‌పీ సామర్థ్యం గల ఎవల్యూషన్ సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని (Fuel Efficiency) అందిస్తుంది. అంతేకాకుండా, అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించడం భారత ఇంజనీరింగ్ బలాన్ని, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చగల మన సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్య విజయగాథ
బీహార్‌లోని మార్హౌరా ప్లాంట్ సాధించిన ఈ విజయం... భారత రైల్వేలోని వ్యూహాత్మక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి (Public-Private Partnership) ఒక గొప్ప నిదర్శనం అని చెప్పొచ్చు. ఇది నూతన ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిని ప్రదర్శించడమే కాక, ప్రపంచ రైల్వే సరఫరా వ్యవస్థకు (Global Railway Supply Chain) సమర్థవంతంగా సహకరించగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+