Mahindra Year-End Offers 2025: మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్
కొత్త కారు కొనాలనుకునే వారికి, ముఖ్యంగా మహీంద్రా SUVలంటే ఇష్టపడే వారికి ఇది నిజంగానే పండగ లాంటి వార్త. ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు, పాత స్టాక్ క్లియర్ చేయడానికి వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఏడాది మహీంద్రా (Mahindra) కూడా అదే బాటలో పయనిస్తూ, ఏకంగా లక్షల రూపాయల డిస్కౌంట్లతో వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.
మహీంద్రా భారీ ఆఫర్ల పండుగ..
ప్రస్తుతం మార్కెట్‌లో మహీంద్రా అంటే ఒక క్రేజ్. స్కార్పియో, థార్, XUV వంటి మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే, ఈ ఏడాది ముగింపు సందర్భంగా (Year-End Sale) డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండేలా కంపెనీ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనం మహీంద్రా XUV400 మోడల్‌పై లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఏకంగా రూ. 4.45 లక్షల వరకు మొత్తం లబ్ధి చేకూరనుంది. ఇందులో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా కలిసి ఉండటం విశేషం.

SUVపై అదిరిపోయే తగ్గింపు..
కేవలం ఎలక్ట్రిక్ కార్లే కాదు, మహీంద్రాలోని ఇతర పాపులర్ పెట్రోల్, డీజిల్ SUVలపై కూడా భారీగా ధరలు తగ్గాయి. మీరు స్టైలిష్‌గా ఉండే మహీంద్రా XUV 3XO ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే, దానిపై రూ. 1.14 లక్షల వరకు ఆఫర్ ఉంది. అలాగే, ఎంతో మంది కలల కారు అయిన మహీంద్రా థార్ రాక్ మోడల్‌పై కూడా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆకట్టుకునే ఫీచర్లతో ఉండే మహీంద్రా XUV 700 కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1.55 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
మరోవైపు, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మారుపేరైన స్కార్పియో క్లాసిక్ పై రూ. 1.40 లక్షలు, స్కార్పియో N మోడల్‌పై రూ. 85,600 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్నీ మీ ప్రాంతం, ఎంచుకున్న వేరియంట్ మరియు డీలర్‌షిప్‌ను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంది.
కారు కొనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. ఒకవైపు పాత సంవత్సరం స్టాక్ క్లియర్ చేసే ఉద్దేశంతో కంపెనీ ఇస్తున్న ఈ భారీ ఆఫర్లు, మధ్యతరగతి కుటుంబాలకు తమ సొంత కారు కల నెరవేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? ఈ డిసెంబర్ 31 లోపు మీ సమీప మహీంద్రా షోరూమ్‌ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి.












Click it and Unblock the Notifications