పసిడి ధరలు జూమ్- రాకెట్ స్పీడ్
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించడం, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ తదుపరి సమావేశంపై చేసిన ప్రకటనలు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల భయాలను తగ్గించింది. దీని ప్రభావంతో బంగారం రేట్లు నేడు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.91 శాతం పెరిగింది.
జూన్ 5 నాటి ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ తాజా సెషన్‌లో 10 గ్రాములకు 1,53,301 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో ఈ కాంట్రాక్ట్ రూ. 1,52,547 నుండి రూ. 1,55,500 మధ్య కదలాడుతోంది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల బంగారం ధరలో సుమారు రూ. 1,398 పెరుగుదల నమోదైంది. ఈ పరిణామం కమోడిటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.

అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు లాభాలను నమోదు చేశాయి. బంగారం ధర ఒక శాతానికి పైగా పెరిగింది. ఔన్స్‌కు 4,850 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తాజా ట్రేడింగ్ సెషన్‌లో 24 క్యారెట్ల (24K) బంగారం ధర గ్రాముకు రూ. 15,420 వద్ద నమోదైంది. 22 క్యారెట్ల (22K) బంగారం ధర గ్రాముకు రూ. 14,135లు పలుకుతోంది. 18 క్యారెట్ల (18K) బంగారం ధరలో కూడా కొంత పెరుగుదల కనిపించింది. దీని ధర గ్రాముకు రూ. 11,565 వద్ద ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,666, 22 క్యారెట్లు - రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,980
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

Click it and Unblock the Notifications