Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 నిమిషాల ఛార్జింగ్.. 300 కి.మీ ప్రయాణం! మెర్సిడెస్ వేగన్ కార్ వేగానికి మైండ్ బ్లాకే!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ప్యూర్ వేగన్' (Pure Vegan) ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (CES 2026)లో తన పాపులర్ మోడల్ GLC ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ కారు పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రపంచంలోనే తొలి 'వేగన్' ఇంటీరియర్
సాధారణంగా లగ్జరీ కార్ల సీట్లు, డ్యాష్‌బోర్డ్ తయారీలో జంతువుల చర్మాన్ని (లెదర్) ఉపయోగిస్తారు. కానీ ఈ కారు ఇంటీరియర్‌లో ఎక్కడా జంతువుల ఉత్పత్తులను వాడలేదు. సీట్లు, స్టీరింగ్ వీల్, కార్పెట్‌లు అన్నీ 'వేగన్' మెటీరియల్‌తో రూపొందించబడ్డాయి. వేగన్ సొసైటీతో కలిసి మెర్సిడెస్ సుమారు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి, 100కు పైగా భాగాలను యానిమల్-ఫ్రీగా తయారు చేసింది. ఏ భాగాన్ని కూడా జంతువులపై పరీక్షించలేదు. కారు ఇంటీరియర్‌లో ఎక్కువగా రీసైకిల్ చేసే పదార్థాలను వాడారు.

Mercedes-Benz Unveils Pure Vegan Electric Car at CES 2026 300 km Range in 10 Minutes

అద్భుతమైన పర్ఫార్మెన్స్, రేంజ్
ఈ కారు కేవలం పర్యావరణానికే కాదు, వేగానికి కూడా పెట్టింది పేరు. దీని ఎలక్ట్రిక్ ఇంజన్ 483 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 713 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 330 kW ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో 300 కి.మీ ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

అత్యాధునిక టెక్నాలజీ
డ్యాష్‌బోర్డ్ మొత్తం విస్తరించి ఉండే 39.1 అంగుళాల భారీ స్క్రీన్ దీని ప్రత్యేకత. మైక్రోసాఫ్ట్, గూగుల్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లు రెండూ కలిసి పనిచేసే ప్రపంచంలోనే తొలి కారు ఇది. ఇందులో లెవల్ 2 ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంది. పార్కింగ్ నుండి డ్రైవింగ్ వరకు ఒక్క క్లిక్‌తో కారు తనంతట తానుగా వెళ్లగలదు.

అమ్మకాలు ఎప్పుడు?
అమెరికాలో 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నుండి ఈ కారు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు నచ్చిన విధంగా 'వేగన్' ఇంటీరియర్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+