Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jio: కొత్త ప్లాన్ అదిరింది, ఇక నుంచి పూర్తి నెలకు రిఛార్జ్

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం మరో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విసిరింది. మొబైల్ వినియోగదారుల ప్రధాన సమస్య అయిన 'నెలవారీ వ్యాలిడిటీ' చిక్కుముడిని విప్పుతూ, రూ. 339 ధరకు సరికొత్త 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

సాధారణంగా టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్‌లను అందిస్తుంటాయి, దీనివల్ల ఏడాదిలో ఒక అదనపు రీఛార్జ్ భారం వినియోగదారులపై పడుతోంది. అయితే, జియో కొత్తగా తీసుకొచ్చిన రూ. 339 ప్లాన్ ఈ ఇబ్బందిని తొలగిస్తుంది. నెలలో 30 రోజులు ఉన్నా లేదా 31 రోజులు ఉన్నా.. మీరు ఏ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మళ్లీ వచ్చే నెల అదే తేదీన రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా నెల మొత్తం నిశ్చింతగా ఉండాలనుకునే వారికి ఇది ఒక 'గోల్డెన్ ఛాన్స్'.

New Jio Rs 339 Recharge Plan vs Rs 319 Plan Everything You Need to Know About Calendar Month Validity
Ambani on Gold: అంబానీ చెప్పిన పెట్టుబడి ప్లాన్, ఇలా చేస్తేనే లాభం!
Ambani on Gold: అంబానీ చెప్పిన పెట్టుబడి ప్లాన్, ఇలా చేస్తేనే లాభం!

డేటా, కాల్స్.. అన్నీ అన్‌లిమిటెడ్!

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అంటే నెల పొడవునా ఇంటర్నెట్ అవసరాలకు తగినంత డేటా లభిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్ లో..

  • అపరిమిత కాల్స్: దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
  • SMS: రోజుకు 100 SMSలు ఉచితం.
  • యాప్స్ యాక్సెస్: జియో టీవీ (JioTV), జియో టీవీ ఏఐ క్లౌడ్ (JioTV AI Cloud) వంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ అదనంగా లభిస్తుంది.
భారీ షాక్ ఇచ్చిన జియో హాట్‌స్టార్: ప్లాన్ రేట్లు డబుల్: ఒక్కసారి ఇనాక్టివేట్ అయితే గోవింద
భారీ షాక్ ఇచ్చిన జియో హాట్‌స్టార్: ప్లాన్ రేట్లు డబుల్: ఒక్కసారి ఇనాక్టివేట్ అయితే గోవింద

రూ. 319 ప్లాన్‌కు.. దీనికి తేడా ఏంటి?

జియోలో ఇప్పటికే రూ. 319 ప్లాన్ అందుబాటులో ఉంది, అది కూడా క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీనే ఇస్తుంది. అయితే రూ. 339 ప్లాన్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇందులో అదనంగా రూ. 14.95 టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్జాతీయ కాల్స్ (ISD) చేసుకోవడానికి లేదా అదనపు వ్యాలిడిటీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ఇతర ఓటీటీ (OTT) సదుపాయాలు లేకపోయినా, ప్రాథమిక అవసరాలు మరియు టాక్‌టైమ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+