New Scam Alert: కొత్త మోసం.. ఆన్‌లైన్ డెలివరీ బాక్సులతో జాగ్రత్త!
New Scam Alert: మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి డెలివరీ అవుతున్నాయా? అయితే ఆ డెలివరీ బాక్సులను వెంటనే చెత్తబుట్టలో పడేయకండి! ఎందుకంటే మీ ఇంటి ముందు పడేసిన డెలివరీ బాక్సులు ఇప్పుడు కొత్తరకం మోసాలకు వేదికగా మారుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయిన ఈ డిజిటల్ యుగంలో ఇంట్లోనే కూర్చుని నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకుంటున్నాం. అయితే డెలివరీ అయిన వెంటనే వస్తువులు తీసుకుని.. ప్యాకేజింగ్‌ను చాలా మంది వెంటనే పడేస్తుంటారు. ఇది ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.
సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు?
కొత్తగా వెలుగులోకి వస్తున్న ఈ స్కాం చాలా తెలివిగా చేస్తున్నారు. మోసగాళ్లు మీ ఇంటిముందు లేదా మీ అపార్ట్‌మెంట్ చెత్త డబ్బా దగ్గర పడేసిన ఖాళీ డెలివరీ బాక్సులను సేకరిస్తున్నారు. ఈ బాక్సులపై మీ మీరు, చిరునామా, కొన్ని సార్లు ఫోన్ నంబర్ వంటి సున్నితమైన సమాచారం ప్రింట్ చేయబడి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఉదాహరణకు మీరు ఇటీవల ఏదైనా ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన వివరాలు వారికీ తెలుసు కాబట్టి డెలివరీలో సమస్య వచ్చిందని లేదా మీ ఆర్డర్ కు అదనపు ఛార్జీలు ఉన్నాయని లేదా మీరు గెలిచిన లాటరీ లేదా బహుమతి లేదా కూపన్‌ను క్లెయిమ్ చేసుకోవాలని చెబుతారు. ఈ వివరాలన్నీ వారికి మీరు పడేసిన బాక్స్ నుంచి లభిస్తాయి. ఆ తర్వాత వారు మిమ్మల్ని ఏదైనా లింక్‌ను క్లిక్ చేయమని.. ఓటీపీని షేర్ చేయమని లేదా మీ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయమని కోరుతారు. మీరు వారికి నిజమైన ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల ప్రతినిధులుగా నమ్మి వివరాలు ఇస్తే.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవడం ఖాయం.

సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
వ్యక్తిగత సమాచారాన్ని నాశనం చేయండి: డెలివరీ బాక్సులను పడేసే ముందు వాటిపై ఉన్న మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ నంబర్ వంటి అన్ని వ్యక్తిగత వివరాలను పూర్తిగా చింపేయండి, కత్తిరించండి లేదా చెరిపేయడం, ఆ పేపర్‌ను కాల్చివేయడం వంటి చేయాలి. ష్రెడర్ ఉంటే ఉపయోగించడం ఉత్తమం.
డెలివరీ బాక్సులను సురక్షితంగా పారేయండి: వీలైతే మీ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పారవేయండి లేదా రీసైక్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
అపరిచిత కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ వివరాలను ధ్రువీకరించడానికి నేరుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దు: మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్, ఓటీపీ వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. ఏ బ్యాంక్ లేదా ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఈ వివరాలను ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అడగదు.
ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications