Credit Score: 15 రోజులే డెడ్ లైన్, RBI కీలక నిర్ణయం

అత్యవసరంగా లోన్ కావాలి... బ్యాంకుకు వెళ్తే మేనేజర్ చెప్పే ఆ ఒక్క మాట మన ప్లాన్‌లన్నింటినీ తలకిందులు చేస్తుంది. "అంతా బానే ఉంది కానీ.. మీ పాత బాకీ ఇంకా రిపోర్టులో కనిపిస్తోంది" అని! నిజానికి మనం ఆ బాకీ ఎప్పుడో తీర్చేసి ఉంటాం. కానీ ఆ వివరాలు మీ క్రెడిట్ స్కోర్‌ (Credit Score) లో అప్‌డేట్ కావడానికి నెలల తరబడి పట్టేది. ఈ ఆలస్యం వల్ల ఎంతో మందికి లోన్లు రాక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడేవారు. అయితే, ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెచ్చిన సరికొత్త సంస్కరణలతో క్రెడిట్ స్కోర్ వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి.

ఇక 15 రోజులకే క్రెడిట్ స్కోర్‌ అప్‌డేట్!

ఇప్పటివరకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీరు అప్పు తీర్చిన వివరాలను క్రెడిట్ బ్యూరోలకు (CIBIL వంటివి) నెలకోసారి మాత్రమే పంపించేవి. దీనివల్ల మీరు ఒకటో తారీఖున అప్పు తీర్చినా, అది రికార్డుల్లోకి ఎక్కడానికి 30 నుండి 40 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం.. ప్రతి 15 రోజులకు ఒకసారి డేటా పంపించాలి. త్వరలోనే దీన్ని వారానికోసారి అప్‌డేట్ చేసేలా సిస్టమ్‌ను మారుస్తున్నారు. అంటే, మీ ఆర్థిక క్రమశిక్షణ ఇక చాలా వేగంగా మీ స్కోర్‌లో కనిపిస్తుంది.

New RBI Credit Score Rules 15 Day Data Updates Quicker Loan Approvals and Penalties for Delay

తప్పులకు ఇక చెక్ - పరిహారం కూడా!

మీకు సంబంధం లేని లోన్ మీ స్కోర్‌లో కనిపిస్తున్నా లేదా ఏదైనా తప్పు ఎంట్రీ ఉన్నా.. వాటిని సరిచేయడం ఇక చాలా సులభం. మీ ఫిర్యాదుపై బ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోలు 30 రోజుల్లోగా స్పందించాల్సిందే. ఒకవేళ ఆ గడువులోగా మీ సమస్య పరిష్కారం కాకపోతే, ఆ సంస్థ మీకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధన వల్ల బ్యాంకులు వినియోగదారుల ఫిర్యాదులపై త్వరగా స్పందిస్తాయి.

లోన్ కావాలా? ఇలా ప్లాన్ చేసుకోండి!

ఈ కొత్త మార్పుల నేపథ్యంలో ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:

  • ముందే చెక్ చేసుకోండి: లోన్ కోసం అప్లై చేసే కనీసం రెండు వారాల ముందే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి.
  • ఏడాదికోసారి రిపోర్ట్: ఏడాదికి ఒక్కసారైనా మీ పూర్తి క్రెడిట్ రిపోర్టును పరిశీలించి, మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
  • ఫిర్యాదు చేయండి: ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో 'డిస్ప్యూట్' రైజ్ చేయండి.

ఒక్క నిమిషం.. జాగ్రత్త!

"మేము మీ క్రెడిట్ స్కోర్ పెంచుతాం.. మాకు కొంత ఫీజు కట్టండి" అంటూ వచ్చే ప్రకటనలను అస్సలు నమ్మకండి. స్కోర్ పెంచే మంత్రదండం ఎవరి దగ్గరా లేదు. మీ అప్పులను సకాలంలో చెల్లించడం, క్రమశిక్షణగా ఉండటం ద్వారానే మీ స్కోర్ పెరుగుతుంది. మాయమాటలు చెప్పే ఏజెన్సీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+