అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ ఉత్పత్తులు.. గిడ్డంగులపై బీఐఎస్ మెరుపు దాడులు!

ఆన్‌లైన్ షాపింగ్ నేడు సర్వసాధారణం అయిపోయింది. ఇంటి వద్ద నుంచే కావలసిన వస్తువులు ఆర్డర్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో చాలా మంది ఇ-కామర్స్ వెబ్‌సైట్లపై ఆధారపడుతున్నారు. అయితే, ఈ సౌలభ్యం వెనుక నాణ్యత లేని ఉత్పత్తుల ముప్పు పొంచి ఉంది. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రమాణాలు పాటించని వస్తువులు విక్రయిస్తున్నారని భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బిఐఎస్ రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులపై బిఐఎస్ మెరుపు దాడులు!
వినియోగదారుల భద్రతే ముఖ్యమని భావించిన బిఐఎస్ అధికారులు, నాణ్యత లేని వస్తువుల అమ్మకాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా దాడులు మొదలుపెట్టారు. లక్నో, గుర్గావ్, ఢిల్లీ నగరాల్లోని పెద్ద పెద్ద ఆన్‌లైన్ కంపెనీల గిడ్డంగులపై మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో బయటపడిన నిజాలు వినియోగదారులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. మార్చి 7, 2025న లక్నోలోని అమెజాన్ గిడ్డంగిపై బిఐఎస్ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ కలకలం రేగింది. తనిఖీలు చేయగా, బిఐఎస్ సర్టిఫికేషన్ లేని 24 హ్యాండ్ బ్లెండర్లు, 215 బొమ్మలు బయటపడ్డాయి. వాటిని వెంటనే సీజ్ చేశారు. ఇక గుర్గావ్‌లోని ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో కూడా తనిఖీలు జరిగాయి. అక్కడ కూడా పరిస్థితి ఏమీ బాగాలేదు. 41 స్పీకర్లు, 134 బొమ్మలు, 534 స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు బిఐఎస్ ముద్ర లేకుండా కనిపించాయి. వీటిని కూడా అధికారులు సీజ్ చేశారు.

online-shopping-alert-bis-raids-expose-substandard-goods-on-amazon-flipkart

టెక్‌విజన్ కంపెనీలో షాకింగ్ సీన్!
ఇది మాత్రమే కాదు, బిఐఎస్ తనిఖీల్లో ఇంకొన్ని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెక్‌విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 మెటల్ వాటర్ బాటిల్స్, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పివిసి కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్ వంటి నాసిరకం వస్తువులు డెలివరీ అవుతున్నాయని గుర్తించారు. వెంటనే బిఐఎస్ అధికారులు ఢిల్లీలోని టెక్‌విజన్ కంపెనీ గోడౌన్లపై రైడ్ చేశారు. అక్కడ చూస్తే దిమ్మతిరిగే సీన్! ఏకంగా 40 గ్యాస్ స్టవ్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 4 వేల ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, దాదాపు 7 వేల ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు బిఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. డిజిస్మార్ట్, యాక్టివా, ఇనాల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్‌ఫ్లై వంటి పెద్ద బ్రాండ్ల వస్తువులు కూడా ఈ లిస్టులో ఉండటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత పెద్ద కంపెనీలు కూడా నాణ్యతను పట్టించుకోకుండా ఇలాంటి మోసాలకు పాల్పడతాయా అని అనిపిస్తుంది.

చట్టం తన పని చేసుకుపోతుంది!
ఇంత భారీ మొత్తంలో నాణ్యత లేని వస్తువులు దొరకడంతో బిఐఎస్ అధికారులు టెక్‌విజన్ కంపెనీపై రెండు కేసులు పెట్టారు. బిఐఎస్ చట్టం 2016 ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు తప్పిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని బిఐఎస్ తేల్చి చెప్పింది. ఈ చట్టం ప్రకారం తప్పు చేసిన వారికి లక్షల్లో జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కనీసం 2 లక్షల రూపాయల ఫైన్ వేయొచ్చు. అవసరమైతే ఆ జరిమానాను పది రెట్లు కూడా పెంచే అధికారం అధికారులకు ఉంది.

బిఐఎస్ సర్టిఫికేషన్ ఉంటేనే నమ్మండి!
నకిలీ వస్తువులు ఎక్కువైపోవడంతో గవర్నమెంట్ రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేసింది. ప్రెషర్ కుక్కర్లు, హ్యాండ్ బ్లెండర్లు, ఫుడ్ మిక్సర్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, రూమ్ హీటర్లు, పివిసి కేబుల్స్, గ్యాస్ స్టవ్లు, బొమ్మలు, హెల్మెట్లు, స్విచ్‌లు, అల్యూమినియం ఫాయిల్ వంటి మనం రోజు వాడే చాలా వస్తువులకు బిఐఎస్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేసింది. బిఐఎస్ స్టాండర్డ్ లేని వస్తువులు సేఫ్టీ టెస్టులు పాస్ కావు. అవి సరిగ్గా పనిచేస్తాయో లేదో కూడా గ్యారెంటీ లేదు. అందుకే అవి చాలా డేంజర్. వాటి మీద ఐఎస్ఐ మార్క్ ఉండకపోవచ్చు లేదా లైసెన్స్ నంబర్ కూడా ఫేక్ కావచ్చు.

వినియోగదారుల ప్రాణాలకు, డబ్బుకు రక్షణ కల్పించడానికే బిఐఎస్ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు కూడా నాణ్యమైన వస్తువులనే కొనుక్కోవాలని బిఐఎస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్ చేసేటప్పుడు వస్తువులపై ఐఎస్ఐ మార్క్, CM/L నంబర్ ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+