యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా?
మధ్య- తూర్పు ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఎకాఎకిన పెరుగుతున్నాయి. బ్యారెల్ ఒక్కింటికి 110-115 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపుగా 90 శాతం మేర ముడిచమురు ధరల్లో పెరుగుదల చోటు చేసకుంది. ఈ పరిస్థితి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలను పెంచుతోంది.
ఈ వారం అంతర్జాతీయ ట్రేడింగ్ ముగియడానికి ముందు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధరలు 95.55 డాలర్ల నుంచి 2.27 శాతం పెరిగి 98.32 డాలర్ల/బ్యారెల్‌కు చేరాయి. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ ధర 3.26 శాతం లాభపడి 112.19 డాలర్ల/బ్యారెల్‌కు చేరుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు దేశ ఆయిల్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు దాదాపు 117 డాలర్లుగా నమోదైంది.

ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం ప్రీమియం గ్రేడ్ పవర్ పెట్రోల్ ధరలను లీటర్‌కు 2.35 రూపాయల వరకు పెంచాయి. పారిశ్రామిక రంగానికి ఉపయోగించే బల్క్ డీజిల్ ధరలు లీటర్‌కు సుమారు 22 రూపాయల వరకు పెరిగాయి. వాహనదారులు ఉపశమనం పొందే వార్త ఏమిటంటే, బైక్, కార్లలో ఉపయోగించే సాధారణ రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి పెంచలేదు.
సామాన్య వినియోగదారులకు తక్షణ ప్రభావం లేనప్పటికీ, పారిశ్రామిక డీజిల్ ధరల పెంపు లాజిస్టిక్స్, పారిశ్రామిక వ్యయాలను పెంచవచ్చు. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపడం ఖాయం. ప్రస్తుతం ప్రభుత్వం వినియోగదారుల ఉపశమనంపై దృష్టి సారించింది. ముడి చమురు ధరలు పెరిగితే, భవిష్యత్తులో ఇంధన ధరలలో మార్పులు సంభవించవచ్చు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలపై నిశితంగా పర్యవేక్షించడం అవసరం.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
-
ఇరాన్ ఆర్మీ జనరల్ మృతి- కూలిన మరో మూలస్తంభం -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
వాహనదారుల మెడపై పెట్రోల్ కత్తి -
వాహనదారులపై మరో బాదుడు గ్యారెంటీ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications