Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold మెరిసింది, వెండి కాసులు కురిపించింది.

ప్రపంచం మరో మహా యుద్ధం అంచున నిలబడింది. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల మెరుపు దాడులు అంతర్జాతీయ మార్కెట్లలో పెను తుపానును సృష్టించాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అస్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి ఇన్వెస్టర్లు ఇప్పుడు 'సురక్షిత ఆస్తుల' (Safe Haven Assets) వైపు క్యూ కడుతున్నారు. సోమవారం మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే.. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది.

సాధారణంగా యుద్ధం లాంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం సహజం. ఈ రోజూ అదే జరిగింది. ఉదయం 11 గంటల సమయానికే దేశీయ మార్కెట్లు సుమారు 1.4 శాతం మేర పతనమయ్యాయి. అయితే, అదే సమయంలో అద్భుతమైన విచిత్రం చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, గోల్డ్ (Gold) మరియు సిల్వర్ (Silver) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) మాత్రం లాభాలతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు ఏకంగా 9 శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి.

Protect Your Wealth Why Investors are Dumping Stocks for Gold and Silver ETFs Amid Rising Global War

ETF ల దూకుడుకు అదే కారణం..

బులియన్ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకడమే ఈ ఈటీఎఫ్‌ల దూకుడుకు ప్రధాన కారణం. ఎంసీఎక్స్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,66,816 వద్ద, వెండి కిలో ధర రూ. 2,90,188 వద్ద ట్రేడ్ అవుతూ సరికొత్త రికార్డులను సృష్టించాయి. యుద్ధం వల్ల కరెన్సీ విలువ పడిపోతుందనే భయం, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. "బంగారం కేవలం లోహం కాదు.. అది సంక్షోభ సమయంలో ఆత్మరక్షణ కవచం" అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు సురక్షిత ఆస్తిగా, ఇటు పారిశ్రామిక లోహంగా వెండికి ఉన్న 'ద్వంద్వ స్వభావం' దానిని మరింత హాట్ కేక్‌గా మార్చేసింది.

వెండి విషయంలో జాగ్రత్త..

అయితే, ఈ గమనం కేవలం తాత్కాలిక ఊహాగానాలతో కూడుకున్నది కాకూడదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం యుద్ధం జరుగుతోందని ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా, క్రమశిక్షణతో కూడిన 'ఆస్తుల కేటాయింపు' (Asset Allocation) ముఖ్యమని సూచిస్తున్నారు. భౌగోళిక రాజకీయ షాక్‌లు, కరెన్సీ అస్థిరత వంటి ప్రమాదాల నుంచి పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవడానికి బంగారం, వెండి ఈటీఎఫ్‌లకు మితమైన కేటాయింపులు చేయడం మేలని పేర్కొంటున్నారు. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపైనే మార్కెట్ స్థిరత్వం ఆధారపడి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+