Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై ఆర్భీఐ అభ్యంతరం

న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ కోరింది. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా ఉన్న చందాకొచ్చర్ భర్త వీడియోకాన్ కంపెనీకి ఆయాచితంగా లబ్ది చేశారనే విషయమై సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖా శర్మ విషయమై ఆర్బీఐ తాజాగా చేసిన ప్రస్తుతం కలకలానికి కారణంగా మారింది.

Reconsider Shikha Sharma’s 4th term: RBI to Axis Board

ఈ విషయమై బ్యాంకు ఛైర్మెన్‌ సంజీవ్ మిశ్రాకు ఆర్బీఐ లేఖ రాసిందని సమాచారం. అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ అపాయింట్‌మెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా బ్యాంకులను కోరింది. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖా శర్మ పదవి కొనసాగింపుపై ఆర్బీఐ పలు సూచనలు చేసింది.

యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీని కూడ విధించింది. ఈ విషయమై బ్యాంకు అధికారులు స్పందించలేదు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలపై బ్యాంకు బోర్డు ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తుందని ప్రకటించింది.

ఈ అంశంపై తుది నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. శిఖాశర్మ 2009లో తొలిసారిగా యాక్సిస్ బ్యాంకు సీఈఓ బాధ్యతలను చేపట్టారు. వరుసగా మూడు సార్లు ఈ పదవిలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ నుండి నాలుగో దఫా సీఈఓగా ఆమె పదవీ కాలం ప్రారంభం కానుంది. మొండి బాకీల విషయంలో యాక్సిస్ బ్యాంకు సీఈఓపై విమర్శలు రావడంతో ఆర్బీఐ ఈ సూచన చేసిందని ప్రచారం కూడ లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+