SBI డేటా లీక్? హ్యాకర్ల చేతిలో లక్షలాది కస్టమర్ల వివరాలు?

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల డేటా భద్రతపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 'సిరియూసిమ్' (Siriusim) అనే పేరుతో గుర్తింపు పొందిన ఒక అజ్ఞాత హ్యాకర్ల బృందం ఎస్‌బీఐకి చెందిన అత్యంత గోప్యమైన కస్టమర్ సమాచారాన్ని తస్కరించినట్లు సంచలన ప్రకటన చేసింది. కస్టమర్ల వ్యక్తిగత వివరాలు, లోన్ అప్లికేషన్లు, అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని ఆ హ్యాకర్ గ్రూప్ పేర్కొనడం బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేపింది. సోషల్ మీడియా వేదికగా ఈ సమాచారాన్ని సైబర్ సెక్యూరిటీ నిఘా సంస్థ 'సైబర్‌పల్స్56' (CyberPulse56) గుర్తించి వెలుగులోకి తెచ్చింది.

సైబర్‌పల్స్56 అందించిన సమాచారం ప్రకారం.. హ్యాకర్ల చేతిలో సీఎస్వీ (CSV) ఫార్మాట్‌లో సుమారు 3,75,000 ఎంట్రీలు, దాదాపు 2,722 పీడీఎఫ్ డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, లోన్ దరఖాస్తులు, ఇతర ఆర్థిక సంబంధిత పత్రాలు ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక ఎంత నిజం ఉందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎస్‌బీఐ వ్యవస్థలపై దాడి జరిగినట్లు లేదా ఆ పత్రాలు నేరుగా బ్యాంకు సర్వర్ల నుంచే లీకైనట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదు.

SBI Data Breach Claim Hacker Group Siriusim Alleges Access to Lakhs of Records and Documents
లోన్ మొత్తం కట్టేసినా ఇంకా 'యాక్టివ్' అనే చూపిస్తోందా? ఇలా సరిచేసుకోండి!
లోన్ మొత్తం కట్టేసినా ఇంకా 'యాక్టివ్' అనే చూపిస్తోందా? ఇలా సరిచేసుకోండి!

ఇంకా ధృవీకరణ కాని వాదనలు.. సైబర్ నిపుణుల హెచ్చరికలు

హ్యాకర్లు చేస్తున్న ఈ వాదనలు ఎంతవరకు నిజమనే దానిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పేర్కొన్న సంఖ్యలో డేటా ఎంట్రీలు ఉన్నప్పటికీ, ఎంత మంది అసలైన కస్టమర్లు ప్రభావితమయ్యారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేటా నిజమే అయితే, భవిష్యత్తులో మోసగాళ్లు వీటిని ఉపయోగించి గుర్తింపు చోరీకి (Identity Theft), ఆర్థిక మోసాలకు, ఫిషింగ్ కాల్స్ లేదా నకిలీ లోన్ అప్లికేషన్లకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!

రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు.. కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి

దేశంలోని ఆర్థిక సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. ఏదైనా సైబర్ భద్రతా ఉల్లంఘన జరిగితే బ్యాంకులు ఆరు గంటల్లోగా రెగ్యులేటరీ సంస్థలకు, సంబంధిత ఏజెన్సీలకు సమాచారం అందించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

మరోవైపు, ఎస్‌బీఐ తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యాధునిక ఎన్క్రిప్షన్, భద్రతా నియంత్రణలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఎవరూ కూడా తమ పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మవద్దని బ్యాంక్ ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+