కుప్పకూలుతున్నవెండి ధరలు- భారీ కరెక్షన్
బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) భారీగా పతనం అయ్యాయి. ఒక దశలో వెండి పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్ లో 20 శాతం వరకు దిగజారింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకోగలిగింది. 10 శాతం వరకు రికవరీ కాగలిగింది. కొంత వరకు కోలుకోగలిగింది. ఇది పాక్షికమే. మార్కెట్లో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత దీనికి కారణం. అయినప్పటికీ- దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో విశ్లేషకులు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
ఈడెల్‌వైస్ సిల్వర్ ఈటీఎఫ్ 20 శాతం లోయర్ సర్క్యూట్ కు పడిపోయింది ఓపెనింగ్ ట్రేడింగ్ లో. ఆ తర్వాత కొంత వరకు బౌన్స్ బ్యాక్ అయింది. దాదాపు 10 శాతం వరకు కోలుకుంది. ఒక్కొక్కటి 232.17 రూపాయల వద్దకు చేరింది. యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ కూడా అదే పరిస్థితిని చవి చూసింది. 20 శాతం మేర పతనం తర్వాత పుంజుకొంది. 231.85 వద్దకు వచ్చింది. బంగారం ఈటీఎఫ్‌లు తొమ్మిది నుండి అయిదు శాతం నష్టానికి పరిమితమయ్యాయి. పాక్షిక రికవరీ ఉన్నా చాలా ఈటీఎఫ్‌లు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి.

సిల్వర్ ఈటీఎఫ్ ఫ్యూచర్స్ సింగిల్ డే కనిష్టస్థాయి నుండి పునరుద్ధరణకు నోచుకోలేదు. 10- 20 శాతం మధ్య నష్టాల్లో ఊగిసలాడుతూ కనిపించాయి. లాభాల స్వీకరణ, డాలర్ బలపడటం బంగారం, వెండి పతనానికి కారణం అవుతున్నాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 1,40,001కి పడిపోయినప్పటికీ, ఆ తర్వాత పాక్షికంగా రీబౌండ్ అయింది. 10 గ్రాములకు 1,43,800 రూపాయలకు చేరింది.
ఈ పరిణామాల మధ్య సీఎంఈ గ్రూప్ మెటల్ ఫ్యూచర్స్‌పై మార్జిన్‌లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇవి నేటి మార్కెట్ ముగిసిన తర్వాత అమలవుతాయి. కామెక్స్ గోల్డ్ మార్జిన్లు ఆరు నుండి ఎనిమిది శాతానికి, సిల్వర్ 11 నుండి 15 శాతానికి పెరిగాయి. ఈ పరిస్థితులపై బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ మాట్లాడారు. బంగారం, వెండి ధరల్లో ఫ్లాష్ క్రాష్ అనేది ఓవర్‌బ్రాట్ మార్కెట్లల్లో ట్రెండ్ రివర్సల్ గా భావించకూడదని అన్నారు.
సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, వెండి సరఫరా లోటు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి పసిడి- వెండి ధరలను ప్రభావితం చేస్తాయని వివరించారు. వెండి ధరల అసాధారణ వృద్ధి తర్వాత దానిపై జాగ్రత్త వైఖరి అవలంభించక తప్పదని మిరా అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఇండియా ప్రతినిధి సిద్ధార్థ్ శ్రీవాస్తవ చెప్పారు. పోర్ట్‌ఫోలియోలను దీర్ఘకాలిక కేటాయింపులకు అనుగుణంగా మార్చుకునే విషయంలో బంగారం, వెండికి అధిక కేటాయింపులను తగ్గించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications