'బాత్రూమ్' కు వెళ్లాలంటే రూ.250 కోట్లు? స్పేస్ టాయిలెట్ మిస్టరీ!

భూమికి వేల మైళ్ల దూరంలో, శూన్యంలో తేలియాడుతూ చంద్రుడి వైపు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ II నౌకలో ఒక చిన్న 'పెద్ద' సమస్య వచ్చి పడింది. అదేంటంటే.. అక్కడి టాయిలెట్ వ్యవస్థ పాడైపోయింది. వినడానికి ఇది సాదాసీదా విషయంగా అనిపించినా, దాని విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ టాయిలెట్ అంచనా వ్యయం సుమారు 23 నుంచి 30 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 250 కోట్లు!). ఒక టాయిలెట్ కోసం ఇన్ని కోట్లా? అనిపిస్తుంది కదా.. కానీ అంతరిక్షంలో అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం!

భూమి మీద గురుత్వాకర్షణ వల్ల వ్యర్థాలు కిందకు వెళ్తాయి. కానీ అంతరిక్షంలో 'మైక్రోగ్రావిటీ' (సున్నా గురుత్వాకర్షణ) ఉంటుంది. అక్కడ వ్యర్థాలు, నీరు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి. మూసి ఉన్న అంతరిక్ష నౌకలో చిన్న లీకేజీ జరిగినా, ఆ వ్యర్థాలు గాలిలో తేలుతూ వ్యోమగాముల ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అందుకే, ఈ టాయిలెట్లను అత్యంత క్లిష్టమైన ఎయిర్‌ఫ్లో - 'సక్షన్' (పీల్చుకునే) పద్ధతులతో తయారు చేస్తారు. గాలి ప్రవాహం ద్వారా వ్యర్థాలను లాగేసి, వాటిని సురక్షితంగా నిల్వ చేసే ఈ వ్యవస్థ కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తారు.

Space Potty Trouble Why NASAs 30 Million Dollars Artemis II Toilet Repair is a High-Stakes Engineering Feat

అపోలో రోజుల్లో అది ఒక నరకం!

1972 నాటి అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములకు సరైన టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు. వారు చాలా అసౌకర్యవంతమైన ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర తాత్కాలిక పద్ధతులపై ఆధారపడేవారు. అది వారికి ఒక పీడకలలా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ల లక్ష్యం కేవలం చంద్రుడిని తాకి రావడం కాదు.. అక్కడ మనుషులు ఎక్కువ కాలం నివసించడం. అందుకే, వ్యోమగాముల సౌకర్యం, పరిశుభ్రతకు నాసా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా మహిళా వ్యోమగాముల అవసరాలకు తగ్గట్టుగా ఈ కొత్త టాయిలెట్లను మరింత సులభంగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు.

Toilet సమస్య చిన్నదే.. కానీ నేర్చుకోవాల్సింది ఎంతో!

ఆర్టెమిస్ నౌకలో ఇప్పుడు తలెత్తిన లోపం మిషన్‌కు పెద్ద ముప్పు ఏమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన వ్యవస్థలు ప్రయోగంలో ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు రావడం సహజం. అయితే, ఈ 30 మిలియన్ డాలర్ల టాయిలెట్ కథ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మనిషి అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపాలన్నా, భవిష్యత్తులో అంగారకుడి (Mars) పై అడుగు పెట్టాలన్నా.. ఆహారం, ఆక్సిజన్‌తో పాటు ఇటువంటి ప్రాథమిక వసతులు కూడా అత్యంత కీలకం. ఒకప్పుడు కక్ష్యలోకి చేరడమే లక్ష్యం.. కానీ ఇప్పుడు అంతరిక్షంలో 'సౌకర్యవంతంగా' జీవించడమే అసలైన విజయం. అందుకే ఆ టాయిలెట్ అంత ఖరీదు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+