Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే ఇబ్బందులే

ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే 'రక్షణ కవచం' అని నమ్మి వేల రూపాయల ప్రీమియంలు చెల్లిస్తున్న సామాన్యుడికి, అవసరమైన వేళ ఆ కవచమే వెన్నుపోటు పొడిస్తే ఆ వేదన వర్ణనాతీతం. లక్నోలో చోటుచేసుకున్న ఈ సంఘటన కేవలం ఒక క్లెయిమ్ తిరస్కరణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కోట్ల మంది పాలసీదారుల గుండెల్లో గూడుకట్టుకున్న భయం.

తల్లి ప్రాణం కాపాడుకోవాలనే ఆరాటం ఒకవైపు.. ఎనిమిదేళ్లుగా కడుపు కట్టుకుని కట్టిన ప్రీమియం మట్టిపాలవుతుందనే ఆవేదన మరోవైపు.." లక్నోకు చెందిన ఒక వ్యక్తి తన తల్లి వైద్యం కోసం పడుతున్న పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాను దాటి దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ఏటా రూ.50 వేలు ప్రీమియం కడుతున్నా, తీరా ఆసుపత్రి బిల్లు కట్టాల్సిన సమయంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించడం సదరు బాధితుడినే కాక, ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది.

Star Health Insurance Claim Rejection Sparks Outrage on X Man Slams Company Over Denied Payout for Sick Mother

Insurance ఆఫీసులో అవమానం.. గుండె కోత!

మన అనుకున్న వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా కాస్త సానుభూతి అవసరం. ఈ సమయంలో ఆర్థికంగా అండగా నిలవాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీలు.. కనీసం పట్టించుకోకపోవడం దారుణం. సదరు కంపెనీ కార్యాలయంలో గంటల తరబడి నిరీక్షించిన బాధితుడికి ఎదురైన సమాధానం వర్ణణాతీతం. "మమ్మల్ని అడిగి పాలసీ తీసుకోలేదు కదా" అని ఒక ఏజెంట్ వ్యాఖ్యానించడం ఇన్సూరెన్స్ కంపెనీల వసూళ్ల వెనుక ఉన్న అసలు నైజాన్ని ఎండగట్టింది. డబ్బులు తీసుకునేటప్పుడు కనిపించే 'వినయం', క్లెయిమ్ ఇచ్చేటప్పుడు 'సాంకేతిక అభ్యంతరాలు'గా ఎందుకు మారుతాయన్న బాధితుడి ప్రశ్న ఇప్పుడు 'X' (ట్విట్టర్) వేదికగా వేలాది మంది గొంతుకగా మారింది.

"బీమా రక్షణ కోసమా.. కాగితపు వాగ్దానం కోసమా?"

ఈ ఒక్క సంఘటనతో ఆరోగ్య బీమా వ్యవస్థపై ఉన్న నమ్మకం ఒక్కసారిగా సడలిపోయింది. ఎనిమిదేళ్లుగా రూ.80,000 ప్రీమియం కడుతున్న మరొక వినియోగదారుడు "రేపు నాకూ ఇదే పరిస్థితి ఎదురైతే నా కుటుంబం గతేంటి?" అని అడిగిన ప్రశ్న బీమా నియంత్రణ సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

కంపెనీ వాదన ఏంటి?

దీనిపై స్పందించిన స్టార్ హెల్త్ సంస్థ, "మెటీరియల్ నాన్-డిస్క్లోజర్" (ముఖ్యమైన ఆరోగ్య వివరాలు దాచడం) వల్లనే క్లెయిమ్ ఆపాల్సి వచ్చిందని క్లుప్తంగా బదులిచ్చింది. అయితే, పాలసీ ఇచ్చేటప్పుడు మెడికల్ చెకప్‌లు చేయని కంపెనీలు, క్లెయిమ్ ఇచ్చేటప్పుడు మాత్రం పాత రికార్డులన్నీ వెతకడం ఎంతవరకు ధర్మమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

విశ్వాసం-నిబంధనల మధ్య 'యుద్ధం'

భారతదేశంలో బీమా రంగానికి ప్రధాన సమస్య 'నమ్మకం'. ఏజెంట్లు ఇన్సెంటివ్‌ల కోసం వ్యాధి వివరాలను ఫారమ్‌లలో సరిగ్గా నింపకపోవడం పెద్ద వైఫల్యంగా భావించాలి. క్లెయిమ్ సమయంలో కంపెనీలు అక్షరాల సందుల్లో దాగిన షరతులను (Fine Print) బయటకు తీయడం సరైన పద్దతి కాదు. ఆసుపత్రి బిల్లుల టెన్షన్‌లో ఉన్న సామాన్యుడికి అంబుడ్స్‌మన్ చుట్టూ తిరిగే ఓపిక ఉండదు. ఈ అంశాలన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలకు వరంగా మారుతుంటే, వినియోగదారుడికి భారంగా మారుతున్నాయి.

ఆరోగ్య బీమా తీసుకోవడం అంటే కేవలం ప్రీమియం కట్టడం కాదు, ఒక భరోసాను నిర్మించుకోవడం. ఆ భరోసా ఆసుపత్రి మెట్ల వద్ద ఆవిరైపోతే, అది ఆ ఒక్క కుటుంబం ఓటమి కాదు.. మొత్తం వ్యవస్థ పతనం. ఇన్సూరెన్స్ కంపెనీలు పారదర్శకతను పెంచకపోతే, 'హెల్త్ ఇన్సూరెన్స్' అనేది కేవలం ధనవంతుల వ్యాపారంగానే మిగిలిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+