Swiggy: స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. లాభాలు లేకపోవడంతో ఏడాదికే..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన స్నాక్ యాప్ ను మూసేసింది. 10-15 నిమిషాల్లో ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన 'Snacc' యాప్ ను లాభాలు లేకపోవడంతో ప్రారంభించిన ఏడాదికే క్లోజ్ చేసింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు అందిన ఈమెయిల్ ద్వారా ఈ యాప్ ను మూసేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. అయితే వ్యాపార వ్యూహాల్లో భాగంగానే ఈ యాప్ ను క్లోజ్ చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ యాప్ స్విగ్గీ తన 'స్నాక్' యాప్ సేవల్ని పూర్తిగా నిలిపివేసింది. ఫిబ్రవరి 19 (గురువారం) నుంచి ఈ యాప్ ను క్లోజ్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. స్నాక్ యాప్ ప్రారంభమైన ఏడాదికే క్లోజ్ కావడం గమనార్హం. కేవలం 10-15 నిమిషాల్లో వినియోగదారులకు ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో లాస్ట్ మినట్ ఫుడ్ డెలివరీ యాప్‌గా గతేడాది జనవరిలో బెంగళూరు కేంద్రంగా ఈ స్నాక్ యాప్ ప్రారంభమైంది.

ఇక స్నాక్స్, బెవరేజెస్, మినీ మీల్స్, డెజర్ట్స్ .. ఇలా సులభంగా, ఫాస్ట్ గా ఈజీగా అందివ్వగలిగే ఫుడ్ ఐటమ్స్‌ ను స్నాక్ యాప్ డెలివరీ చేసేది. కానీ ఈ సేవలకు సరైన ఆదరణ లభించలేదు. ఈ ఏడాది కాలంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాగే ప్రతి ఆర్డర్‌ పై లాభాలను ఆర్జించడం కష్టంగా మారింది. వ్యాపారాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవుతున్న ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈ యాప్ ను క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Swiggy Shuts Down Snacc Snack App After 1 Year Profit Pressures End 10-15 Min Delivery Experiment

అలాగే ఇతర వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ సంస్థ పేర్కొంది. అయితే తాము మాత్రం ప్రయోగాలు చేయడం ఆపబోమని ప్రకటించింది. ఇక ఈ యాప్ క్లోజ్ కారణంగా ఈ యాప్ లో పని చేసే ఉద్యోగుల భద్రత కోసం స్విగ్గీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.'స్నాక్' మూసివేత వల్ల ప్రభావితమైన ఉద్యోగులను కంపెనీలోని ఇతర విభాగాల్లోకి తీసుకుంటామని.. వారికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+