టాటా సియెర్రా వచ్చేస్తోంది.. క్రెటా, సెల్టోస్‌లకు ఇక కష్టకాలమే!

భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సృష్టించిన 'టాటా సియెర్రా' ఇప్పుడు సరికొత్త హంగులతో రీ-లాంచ్ అయ్యి దుమ్మురేపుతోంది. టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకానిక్ బ్రాండ్ 'టాటా సియెర్రా'ఎట్టకేలకు రోడ్లపైకి రావడానికి సిద్ధమైంది అద్భుతమైన లుక్స్, శక్తివంతమైన ఇంజన్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కారు కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు. జనవరి 15 నుంచి ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రికార్డు స్థాయిలో బుకింగ్స్.. పెరిగిన ఉత్పత్తి
టాటా సియెర్రాకు వస్తున్న భారీ స్పందనను చూసి కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. మొదట నెలకు 7,000 యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. డిమాండ్ దృష్ట్యా దానిని 12,000 నుండి 15,000 యూనిట్లకు పెంచారు. గుజరాత్‌లోని సానంద్ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి శరవేగంగా జరుగుతోంది. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి, కస్టమర్లకు త్వరగా కారును అందించాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

Tata Sierra Relaunch Creates Buzz A Serious Threat to Creta and Seltos

మూడు ఇంజన్ ఆప్షన్లు.. అదిరిపోయే పర్ఫార్మెన్స్
టాటా సియెర్రా మూడు రకాల ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

*1.5 లీటర్ పెట్రోల్ (NA): స్మూత్ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం. ఇది 106 PS పవర్, 145 Nm టార్క్‌ను అందిస్తుంది.

*1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (Hyperion): వేగాన్ని ఇష్టపడే వారి కోసం. ఇది 160 PS పవర్, 255 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే వస్తుంది.

*1.5 లీటర్ డీజిల్ (Kryojet): లాంగ్ డ్రైవ్స్ చేసేవారికి ఇది బెస్ట్. ఇది 280 Nm (ఆటోమేటిక్) వరకు టార్క్‌ను అందిస్తుంది.

సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు
ఈ కారులో ఉన్న ప్రధాన ఆకర్షణ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఈ సెగ్మెంట్‌లో మరే కారులోనూ ఇటువంటి ఫీచర్ లేదు. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్‌ఈడీ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. టాటా బ్రాండ్ అంటేనే భద్రత. ఇందులో ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

పోటీ ఎవరితో?
టాటా సియెర్రా నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 16-17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న టాటా, సియెర్రా రాకతో దానిని 25శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా 2026 చివరలో సియెర్రా ఈవీ (EV) వెర్షన్ కూడా లాంచ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+