Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TCS కొంపముంచిన H1B Visa ఫీజు ఫెంపు- భారీగా తగ్గిన ఆదాయం

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాలు భారీగా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసిక కాలంతో పోల్చుకుంటే ఏకంగా 14 శాతం మేర క్షీణించాయి. రెవెన్యూ మాత్రం స్వల్ప వృద్ధిని సాధించింది. షేర్‌హోల్డర్లకు సంబంధించిన TCS నికర లాభం (ప్రావిట్ ఆఫ్టర్ ట్యాక్స్) గత ఏడాదితో పోలిస్తే 13.9 శాతం తగ్గి రూ. 10,657 కోట్లుగా నమోదైంది.

అంతకుముందు ఏడాది ఇదే కాలంలో టీసీఎస్ సాధించిన లాభాల మొత్తం రూ. 12,380 కోట్లు. గత సెప్టెంబర్ లో ముగిసిన రెండో త్రైమాసికంలో కూడా లాభాలు తగ్గాయి. రెండో త్రైమాసికంలో రూ. 12,075 కోట్ల నికర లాభంలో 11.7 శాతం మేర తగ్గుదల కనిపించింది. అదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం (టాప్‌లైన్) దాదాపు అయిదు శాతం వృద్ధితో సాధించింది.

TCS Q3 Net Profit Dips 14 percent to Rs 10657 Crore Amid Hiring Shake-Up and H-1B Impact

మొత్తం ఆర్థిక కార్యకలాపాలు 67,087 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ సంఖ్య 63,973 కోట్ల రూపాయలు. నికర లాభం తగ్గినప్పటికీ, రెవెన్యూ కార్యకలాపాల్లో వృద్ధి కనిపర్చడం విశేషం. ఈ ఫలితాలతో పాటు.. టీసీఎస్ తన షేర్ హోల్డర్లకు తీపి కబురు వినిపించింది. ఒక్కో షేరుకు 11 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. అలాగే, 46 రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది.

మొత్తం కలిపి అర్హులైన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుపై 57 రూపాయల డివిడెండ్ లభించనుంది. ఈ డివిడెండ్‌కు జనవరి 17, 2026ను రికార్డు తేదీగా నిర్ణయించింది టీసీఎస్. ఈ తేదీ నాటికి కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో లేదా డిపాజిటరీల రికార్డులలో లబ్ధిదారులుగా నమోదైన ఈక్విటీ వాటాదారులకు ఫిబ్రవరి 3వ తేదీన డివిడెండ్ చెల్లిస్తుంది.తాజా ప్రకటనతో కలిపి, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం డివిడెండ్ 79 రూపాయలకు చేరుకుంది.

కాగా- మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం లేఆఫ్స్, అమెరికాలో షట్ డౌన్, హెచ్ 1బీ వీసా ఛార్జీల పెంపు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకోనుండటం వంటి అంశాలను ప్రధాన కారణంగా అంచనా వేస్తోంది టీసీఎస్. గత ఏడాది 12,000 మందికి పైగా ఉద్యోగులను లేఆఫ్స్ కింద తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగ కోతల వల్ల సంభవించిన రూ. 1,135 కోట్ల పునర్నిర్మాణ ఖర్చుల కారణంగా కంపెనీ లాభం తగ్గిందని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం కూడా టీసీఎస్ నికరలాభాలు తగ్గడానికి కారణం అయ్యాయి. లక్ష డాలర్ల ఫీజు వల్ల H1B వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం 500 మంది అసోసియేట్లను మాత్రమే కొత్త H1-Bలపై పంపింది. టీసీఎస్ దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అమెరికా, లాటిన్ అమెరికాలో స్థానిక నియామకాలను విస్తరించడంపై కూడా TCS దృష్టి సారిస్తోంది. ఈ త్రైమాసికంలో కోస్టారికాలో తన కార్యకలాపాలను విస్తరించడానికి టీసీఎస్ ఓ కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది కూడా.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+