Khaby Lame: సోషల్ మీడియా చరిత్రలోనే భారీ డీల్!

నోరు విప్పకుండా ప్రపంచాన్ని నవ్వించిన వ్యక్తి... చేతులను పైకెత్తి "ఇదే కదా సరైన మార్గం" అని చెప్పిన వ్యక్తి... ఇప్పుడు అదే వ్యక్తి డిజిటల్ ప్రపంచంలో వేల కోట్ల రూపాయల డీల్‌తో చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ స్టార్ ఖాబీ లేమ్ (TikTok Star Khaby Lame) తన అంతర్జాతీయ బ్రాండ్, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించే కంపెనీని ఏకంగా రూ.8,980 కోట్లకు ($975 మిలియన్లు) విక్రయించారు.

25 ఏళ్ల ఇటాలియన్ కంటెంట్ క్రియేటర్ అయిన ఖాబీ లేమ్ (అసలు పేరు: సెరింజ్ ఖాబానే లేమ్) కోవిడ్-19 మహమ్మారి సమయంలో సోషల్ మీడియా ప్రపంచాన్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నారు. సంక్లిష్టమైన 'లైఫ్ హ్యాక్స్‌'ను నిశ్శబ్ద హాస్యంతో, సింపుల్‌గా ఎండగట్టే వీడియోలతో కోట్లాది మందిని ఆకట్టుకున్నారు. మాటలు అవసరం లేకుండానే సందేశాన్ని చేరవేయగల ప్రత్యేక శైలే ఆయనను గ్లోబల్ ఐకాన్‌గా మార్చింది.

TikTok Star Khaby Lame Sells Global Brand Company for 975 Million Dollars in Landmark Deal

ఖాబీ లేమ్‌కు చెందిన "స్టెప్ డిస్టింక్టివ్ లిమిటెడ్" కంపెనీని హాంగ్‌కాంగ్‌కు చెందిన పబ్లిక్‌గా ట్రేడయ్యే హోల్డింగ్ సంస్థ "రిచ్ స్పార్కేల్" కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా, చైనాకు చెందిన లైవ్‌స్ట్రీమింగ్ & కంటెంట్ కామర్స్ దిగ్గజం "అన్హుయ్ జియావోహైయాంగ్ నెట్‌వర్క్ టెక్నాలజీ కో. లిమిటెడ్" వచ్చే 36 నెలల పాటు లేమ్ గ్లోబల్ కమర్షియలైజేషన్‌కు ప్రత్యేక ఆపరేటింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది.

Khaby Lame వ్యూహం..

ఈ డీల్ వెనుక ఉన్న వ్యూహం మరింత ఆసక్తికరంగా మారింది. ఖాబీ లేమ్ అభిమాన గణాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే వార్షికంగా $4 బిలియన్ల (సుమారు ₹36,800 కోట్లు) అమ్మకాలు సాధ్యమవుతాయని ఆయన కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యూహం అమెరికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా అనే మూడు కీలక మార్కెట్లపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది ఒకే పెద్ద ప్రచారం కాకుండా, ట్రాఫిక్, ఆపరేషన్స్, ఫుల్ఫిల్‌మెంట్, టెక్నాలజీ అనే నాలుగు అంశాల సమిష్టి ఫలితంగా రూపుదిద్దుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

సోషల్ మీడియా కంటెంట్‌

ఈ ఒప్పందంలో మరో కీలక అంశం AI డిజిటల్ ట్విన్ అభివృద్ధి. ఖాబీ లేమ్ తన ఫేస్ ఐడి, వాయిస్ ఐడి, బిహేవియరల్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వడంతో, బహుభాషా సోషల్ మీడియా కంటెంట్‌ను సృష్టించనున్నారు. దీని ద్వారా ఆయన డిజిటల్ ఉనికి మరింత విస్తరించి, భిన్న భాషలు మాట్లాడే ప్రేక్షకులను చేరుకునే అవకాశం కలగనుంది.

ఎవరీ Khaby Lame..

సెనెగల్ మూలాలు కలిగిన ఖాబీ లేమ్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 77 మిలియన్లకు పైగా, టిక్‌టాక్‌లో 161 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నారు. పెద్ద కళ్లతో, అర్థవంతమైన చిరునవ్వుతో, చివర్లో చేతులు పైకెత్తే ఆయన సైలెంట్ రియాక్షన్‌నే ప్రపంచం గుర్తుపట్టే ట్రేడ్‌మార్క్‌గా మార్చింది. 2020 మార్చిలో ఫ్యాక్టరీ మెకానిక్‌గా పనిచేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత, ఇటలీలోని ట్యూరిన్ సమీపంలోని చివాస్సోలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌లో ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఈ వినూత్న కంటెంట్ ఐడియాను రూపొందించారు. అప్పటి నుంచి సోషల్ మీడియా ప్రపంచంలో అతని ఎదుగుదల ఒక డిజిటల్ అద్భుతంగా మారింది. సుమారు $20 మిలియన్ల అంచనా ఆదాయంతో, ఖాబీ లేమ్ ఇప్పటికే హ్యూగో బాస్ (క్యాప్సూల్ కలెక్షన్), ఎయిర్‌బిఎన్‌బి, క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్, పలు హాలీవుడ్ స్టూడియోలతో లాభదాయక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+