Gold Price Today: ధరల మోత మోగిస్తున్న పసిడి.. వెండి కాస్త వెలవెల!

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. పసిడి ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, తరతరాలుగా సంపదను కాపాడుకునే సాధనం కూడా. అందుకే, ఆర్థిక సంక్షోభాలు మరియు అనిశ్చితి సమయాల్లో బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తుంది. భారతదేశంలో బంగారం ధరల కదలికలను గమనించడం ద్వారా ఆర్థిక పరిస్థితులను అంచనా వేయవచ్చు. ఈరోజు బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి.

హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?
ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (999 స్వచ్ఛత) గ్రాము ధర రూ. 8,782 కి చేరింది. నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ. 11 పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 8,050 వద్ద కొనసాగుతోంది, ఇది నిన్నటి ధర కంటే రూ. 10 ఎక్కువ. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,820 గాను, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,500 గాను నమోదయ్యాయి.

Today s gold prices in Hyderabad and vijayawada - How much is pure gold

విజయవాడలో ఇలా..
దేశంలోని ప్రధాన నగరాల్లోనూ స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ రూ. 87,820, 22 క్యారెట్ రూ. 80,500 ఉంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ రూ. 87,970, 22 క్యారెట్ రూ. 80,650, ముంబైలో 24 క్యారెట్ రూ.87,820, 22 క్యారెట్ రూ. 80,500లకు చేరింది. బెంగళూరులో 24 క్యారెట్ రూ. 87,820, 22 క్యారెట్ రూ. 80,500, కోల్‌కతా 24 క్యారెట్ రూ. 87,820, 22 క్యారెట్ రూ. 80,500 ఉంది. కేరళ 24 క్యారెట్ రూ. 87,820, 22 క్యారెట్ రూ 80,500లకు చేరింది. అహ్మదాబాద్లో 24 క్యారెట్ రూ.87,870. 22 క్యారెట్ -రూ. 80,550లకు పెరిగింది. పూణే 24 క్యారెట్ రూ. 87,820, 22 క్యారెట్ రూ. 80,500 లకు చేరింది. ఇక విజయవాడలో 24 క్యారెట్ - రూ. 87,820, 22 క్యారెట్ రూ . 80,500లకు పెరిగింది.

కాస్త తగ్గిన వెండి ధరలు..
బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు మాత్రం చాలా స్పల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో ఒక గ్రాము వెండి ధర రూ. 108 గానూ, 8 గ్రాముల వెండి ధర రూ. 864 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 1,080 గానూ ఉంది. కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,08,000 గానే ఉంది. మొత్తంగా కేజీ వెండికి గాను రూ.100 మాత్రమే తగ్గింది.

బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. కాబట్టి, పెట్టుబడి పెట్టాలనుకునేవారు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించి, సరైన సమయంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు.

గమనిక: ఈ ధరలు కేవలం అంచనా మాత్రమే. ఆభరణాల తయారీ ఛార్జీలు, GST (వస్తువులు మరియు సేవల పన్ను) వంటి అదనపు ఛార్జీల కారణంగా ధరల్లో మార్పులు ఉండవచ్చు. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+