Union Budget 2026: ట్యాక్స్ పేయర్స్ కు ఊరట కష్టమేనా?
బడ్జెట్ 2026 దగ్గరపడుతున్న కొద్దీ ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగుల్లో అంచనాలు, ఆందోళనలు రెండూ పెరుగుతున్నాయి. గత కొన్ని బడ్జెట్లలో మధ్యతరగతికి పరిమిత ఊరట మాత్రమే లభించడంతో, ఈసారి అయినా ట్యాక్స్ భారం తగ్గుతుందా అనే ప్రశ్న కీలకంగా మారింది. మరి నిర్మలమ్మ పద్దులో ఇన్‌కమ్ ట్యాక్స్‌పై నిర్ణయాలుంటాయా? ఉద్యోగులకు నిజంగా ఊరట దక్కుతుందా?
స్లాబుల్లో మార్పులుంటాయా?
బడ్జెట్ 2026లో కొత్త ట్యాక్స్ విధానం (New Tax Regime) పైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త విధానంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఈసారి కూడా శ్లాబ్స్‌లో స్వల్ప మార్పులు లేదా మినహాయింపు, లిమిట్ పెంపు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే భారీ స్థాయిలో స్లాబ్ మార్పులు జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

స్టాండర్డ్ డిడక్షన్ - రిబేట్‌పై ఆశలు
ఉద్యోగులు ఎక్కువగా ఎదురుచూస్తున్నది స్టాండర్డ్ డిడక్షన్ పెంపు. ప్రస్తుతం ఉన్న పరిమితిని మరింత పెంచితే నెలనెలా జీతం పొందే వారికి కొంత ఊరట లభిస్తుంది. అలాగే సెక్షన్ 87A కింద రిబేట్ పరిమితి (ప్రస్తుతం తక్కువ ఆదాయ వర్గాలకు వర్తించే రాయితీ)ను పెంచే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
పాత ట్యాక్స్ విధానానికి స్వస్తి?
బడ్జెట్ 2026లో ప్రభుత్వం పాత ట్యాక్స్ విధానాన్ని క్రమంగా పక్కకు నెట్టే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. డిడక్షన్లు, మినహాయింపులతో కూడిన పాత విధానం కన్నా, సరళమైన కొత్త విధానాన్నే ప్రజలు ఎంచుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో HRA, 80C, 80D వంటి డిడక్షన్లపై కొత్త రాయితీలు వచ్చే అవకాశం చాలా పరిమితంగా ఉంది.
ఉద్యోగులకు ఊరట కష్టమే?
ప్రభుత్వానికి మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, రక్షణ రంగం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్స్ ఆదాయం కీలకంగా మారింది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ కోతలు చేస్తే రెవెన్యూ లోటు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఉద్యోగులకు భారీ ఊరట ఇవ్వడం ఈసారి కూడా కష్టమేనని అర్థమవుతోంది.
పన్ను పరిధిని పెంచడం..
పాన్-ఆధార్ అనుసంధానం ద్వారా జీఎస్టీ ట్రాకింగ్ ను పెంచడం, డిజిటల్ రసీదులను ప్రోత్సహించడం ద్వారా పన్ను పరిధిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. ఈసారి బడ్జెట్ కేవలం ఉచిత పథకాలు లేదా రాయితీల చుట్టూ కాకుండా, దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసే దిశగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. భారత్ తన వృద్ధి రేటును కాపాడుకుంటూనే, ద్రవ్యలోటును కట్టడి చేయాల్సి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక రోడ్ మ్యాప్‌లా ఉండబోతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications