ట్రంప్ టారిఫ్‌లకు చెక్.. బడ్జెట్‌తో ఎగుమతిదారులకు ఊరట!

అమెరికా విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతున్న వేళ... ముఖ్యంగా సీఫుడ్‌, జౌళి, లెదర్‌ వంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా, పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక నిర్ణయాలు ప్రకటించారు. అదే సమయంలో దేశీయ తయారీకి ఊతమిస్తూ, విమానాల తయారీ నుంచి అణు విద్యుత్‌ ప్రాజెక్టుల వరకు అవసరమైన అనేక ముడి పదార్థాలపై కస్టమ్స్‌ సుంకాల మినహాయింపులు ఇచ్చారు.

సుంకాల వేళ... ఎగుమతిదారులకు ఊపిరి

అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా పడిన సముద్రపు ఆహారం, జౌళి రంగాల్లో ఎగుమతుల ఖర్చు తగ్గించి పోటీ పెంచడమే లక్ష్యంగా బడ్జెట్‌లో పలు మార్పులు చేశారు. ఎగుమతి చేసే సీఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అవసరమైన నిర్దిష్ట ముడిసరుకులపై డ్యూటీ-ఫ్రీ దిగుమతుల పరిమితిని 1% నుంచి 3%కి పెంచారు (FOB విలువ ఆధారంగా). ఇప్పటికే లెదర్‌, సింథటిక్‌ ఫుట్‌వేర్‌కు వర్తిస్తున్న విధానాన్ని షూ అప్పర్‌ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలకు కూడా వర్తింపజేశారు. లెదర్‌, జౌళి, సింథటిక్‌ ఫుట్‌వేర్‌ ఫైనల్‌ ప్రొడక్ట్‌ల ఎగుమతులకు ఇచ్చే గడువును ఆరు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించారు.

Union Budget 2026 Offers Major Relief to Exporters Amid Trump Tariffs with Customs Duty Exemptions and Textile Sector Boost

తయారీ రంగానికి ఊతం... ఇవి డ్యూటీ ఫ్రీ

దేశీయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, గ్లోబల్‌ పోటీకి సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో పలు రంగాల్లో కస్టమ్స్‌ సుంకం మినహాయింపులు ప్రకటించారు. అణు విద్యుత్‌ ప్రాజెక్టులకు అవసరమైన పరికరాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపును 2035 వరకు కొనసాగింపు ఉంటుంది. కీలక ఖనిజాల తవ్వకాలకు అవసరమైన మూలధన ఉత్పత్తుల దిగుమతులపై సుంకం మినహాయింపు ఇచ్చారు. అలాగే పౌర, రక్షణ రంగాల్లో వినియోగించే శిక్షణ విమానాలు, ఇతర విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలపై డ్యూటీ ఫ్రీ దిగుమతులకు వీలు కల్పించారు. మైక్రోవేవ్‌ ఓవెన్ల తయారీలో ఉపయోగించే ఎంపిక చేసిన భాగాలపై దిగుమతి సుంకానికి కూడా మినహాయింపు ఇచ్చారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ల తయారీ భాగాలు, సోలార్‌ గ్లాస్‌లో వినియోగించే సోడియం యాంటీమోనేట్‌పై కూడా సుంకం మినహాయింపు ఉంటుంది.

మత్స్యకారులు, స్టార్టప్‌లకు శుభవార్త

ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌లో (EEZ) ఫిషింగ్‌ బోట్ల ద్వారా చేపల వేటపై కస్టమ్స్‌ సుంకం మినహాయింపు ఇచ్చారు. కొరియర్‌ ద్వారా చేసే ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న రూ.10 లక్షల కన్‌సైన్‌మెంట్‌ పరిమితిని పూర్తిగా తొలగించారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు చిన్న పరిమాణంలోనూ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశం కలుగుతుంది.

జౌళి రంగానికి ప్రత్యేక బూస్ట్‌

  • జౌళి రంగాన్ని భవిష్యత్‌కు సిద్ధం చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ప్రతిపాదించారు.
  • సిల్క్‌, ఉన్ని, జూట్‌, కొత్తతరం ఫైబర్‌లలో స్వావలంబన కోసం 'నేషనల్‌ ఫైబర్‌ స్కీమ్‌'
  • సంప్రదాయ జౌళి క్లస్టర్లను ఆధునికీకరించేందుకు 'టెక్స్‌టైల్‌ ఉపాధి పథకం'
  • పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు

మొత్తం మీద...

ట్రంప్‌ టారిఫ్‌ల వల్ల ఏర్పడిన ఒత్తిడికి బడ్జెట్‌ ద్వారా సమతుల్య ప్రతిస్పందన ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎగుమతుల పోటీతత్వం పెంచడం, తయారీ ఖర్చులు తగ్గించడం, MSMEలు-స్టార్టప్‌లకు గ్లోబల్‌ అవకాశాలు తెరవడం... ఈ మూడు లక్ష్యాలే ఈ ప్రతిపాదనల గుండెచప్పుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+