యూపీఐ కొత్త రూల్స్.. రూ.10 లక్షల వరకు ఛాన్స్ !
డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ప్రస్తుత కాలంలో చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. కాగా యూపీఐ (UPI) ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శుభవార్త అందించింది. తరచూ లావాదేవీల పరిమితి సమస్యను ఎదుర్కొంటున్న వారికి గణనీయమైన ఊరట కల్పిస్తూ.. కీలక రంగాల్లో రోజువారీ లావాదేవీల పరిమితిని ఏకంగా రూ.10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఈరోజు ( సెప్టెంబర్ 15, 2025 ) నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇప్పటివరకు పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు, రుణ ఈఎంఐలు లేదా పెట్టుబడులు చెల్లించాలంటే వినియోగదారులు లావాదేవీలను విభజించుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు చెక్కులు లేదా బ్యాంకు బదిలీలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించి, అధిక విలువైన చెల్లింపులను డిజిటల్ రూపంలో సులభతరం చేయడమే NPCI లక్ష్యంగా తెలుస్తోంది.

ఎంత పరిమితి పెరిగింది?
- బీమా ప్రీమియంలు, క్యాపిటల్ మార్కెట్లు → ఒక్కో లావాదేవీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. రోజువారీ గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.
- రుణ వాయిదాలు (EMIs), ట్రావెల్ బుకింగ్స్, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ → ఒక్కో లావాదేవీ పరిమితి రూ.5 లక్షలు, రోజువారీ గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.
- క్రెడిట్ కార్డ్ బిల్లులు → ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షలు, రోజువారీ పరిమితి రూ.6 లక్షలు.
- నగల కొనుగోళ్లు → ఒక్కో లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు, రోజువారీ గరిష్ట పరిమితి రూ.6 లక్షలు.
- వ్యాపార/మర్చంట్ లావాదేవీలు (P2M) → ఒక్కో లావాదేవీ రూ.5 లక్షలు, రోజువారీ పరిమితి వర్తించదు.
వ్యక్తిగత లావాదేవీలు యథాతథం..
- ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) డబ్బు బదిలీ చేసే రోజువారీ పరిమితి రూ.1 లక్షగానే కొనసాగుతుంది. దీనిలో ఎలాంటి మార్పులు లేవు.
కొత్త మార్పుల ప్రయోజనాలు..
- పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు, రుణ ఈఎంఐలు, పెట్టుబడులు ఒకే ట్రాన్సాక్షన్‌లో చెల్లించే సౌకర్యం.
- ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్, విమాన టిక్కెట్లు ప్లాన్ చేసుకునే వారికి గరిష్ట పరిమితి పెరగడం వలన సులభతరం.
- వ్యాపారులు, దుకాణదారులు కోసం పెద్ద లావాదేవీలు వేగంగా పూర్తి చేసుకునే అవకాశం.
- భద్రత పెంపు - ఈ సౌకర్యం కేవలం ధ్రువీకరించబడిన వ్యాపారులకు (Verified Merchants) చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది.
- వినియోగదారులకు ఎలాంటి అదనపు ప్రక్రియ అవసరం లేదు
ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌ల వినియోగదారులకు కొత్త పరిమితులు ఆటోమేటిక్‌గా వర్తిస్తాయి. ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ లేదా అదనపు దశలు అవసరం ఉండవు.
-
ఆ హీరో చెప్పినవన్నీ సోది, పచ్చి అబద్ధాలు నమ్మొద్దు.. తేజ షాకింగ్ కామెంట్స్ -
'రో-కో రిటైర్మెంట్: వన్డే క్రికెట్‌కు పట్టిన గ్రహణం వీడింది!': మాజీ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్! -
మెగాస్టార్ మూవీపై విజయ్ షాకింగ్ పోస్ట్.. మనవాళ్లే ఇలా చేస్తే బాధ !! -
ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక, ఉత్తర్వులు..!! -
ఆ ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఇక జెట్ స్పీడ్ లో.. తీపికబురు! -
"కొత్తిమీర టమాటా పచ్చడి" ఈజీగా ఎలా చేయాలంటే... -
ఊహకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు -
టీమిండియా బిగ్ వికెట్ డౌన్- న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ -
ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి భారీ కానుక - ఖాతాల్లోకి బకాయిలు..!! -
ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! -
మొన్న బన్నీ, నిన్న ప్రభాస్..: ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?












Click it and Unblock the Notifications