మీకు భయపడే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ముఖేష్ అంబానీ

భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడంపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఘాటుగా స్పందించింది. ఈ వివాదానికి చెక్ పెట్టింది. తాము వ్యాపార రంగంలో ఎప్పుడూ పోటీకి భయపడలేదని తేల్చి చెప్పింది. విదేశీ సంస్థలతో సహా ఏ పోటీదారునైనా మార్కెట్లోకి వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేసింది. భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రతి సంస్థ కూడా ఇక్కడి చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఇదివరకు రిలయన్స్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగకుండా కొన్ని బడా వ్యాపార శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా 165 కంటే ఎక్కువ దేశాల్లో స్టార్‌లింక్ విజయవంతంగా పనిచేస్తోందని, అయిదేళ్లుగా భారత నిబంధనలను పాటిస్తున్నప్పటికీ లైసెన్స్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నలు సంధించారు.

We have never feared competition welcome competition in satellite communications says Reliance

దీనిపై తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ అనేది స్వదేశీ, విదేశీ కంపెనీలన్నింటికీ ఒకే విధంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. స్వయంగా తమ జియో సంస్థకు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల అనుమతులు కూడా ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలోనే ఉన్నాయని వివరించింది. నిబంధనలు అందరికీ సమానంగానే ఉంటాయని గుర్తు చేసింది.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

భారత్ ఎప్పుడూ నూతన ఆవిష్కరణలు, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఎలాంటి సాంకేతికతనైనా ఆదరిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ పునరుద్ఘాటించింది. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారో నిర్ణయించేదే పోటీతత్వమని, దానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేసింది.

ఆల్ టైమ్ హై: జియో ఐపీఓ పూర్తి వివరాలు
ఆల్ టైమ్ హై: జియో ఐపీఓ పూర్తి వివరాలు

దేశీయ టెలికాం రంగంలో తమ సొంత ప్రస్థానాన్ని ఈ సందర్భంగా రిలయన్స్ గుర్తుచేసింది. 2016లో తీవ్ర పోటీ ఉన్న దేశీయ టెలికాం మార్కెట్లో జియో అడుగుపెట్టిందని, ఒక్క కస్టమర్ కూడా లేకుండా ప్రయాణం ప్రారంభించామని తెలిపింది. ఈ పదేళ్ల అతి తక్కువ కాలంలోనే సుమారు 53 కోట్ల మందికి పైగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్నామని, ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు నాణ్యమైన డేటా, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక వసతులను ప్రజలకు అందించామని పేర్కొంది.

అటు కేంద్రం కూడా ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను ఇదివరకే తిప్పికొట్టింది. విదేశీ సంస్థల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు ముమ్మాటికీ ఆధారరహితమైనవని తేల్చిచెప్పింది. దేశ శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధన అనేది.. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉందని స్పష్టం చేసింది. స్పేస్‌ఎక్స్ శాటిలైట్ విభాగానికి సంబంధించిన భద్రతాపరమైన తనిఖీలు ప్రక్రియలో ఉన్నాయని, దరఖాస్తు చేసుకున్న మిగిలిన సంస్థలతో పోలిస్తే ఇది కూడా పరిశీలన దశలో ఉందని వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+