Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Beer బాటిల్ లెక్క తేలింది. ఎవరి జేబులోకి ఎంత వెళ్తోంది?

బీర్ ప్రియులకు షాకిచ్చే నిజం ఇది. మీరు కొనే ఒక బీర్ బాటిల్ ధరలో సింహభాగం ప్రభుత్వం జేబులోకి వెళ్తోందని మీకు తెలుసా? దాదాపు 58 శాతం కంటే ఎక్కువ వాటా పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి అందుతోంది. అసలు మనం తాగే బీరు తయారీ ఖరీదు ఎంత? మనం ఎంత అదనంగా కడుతున్నాం?

మీరు రూ. 180 పెట్టి ఒక లైట్ బీర్ బాటిల్ కొన్నప్పుడు, అందులో మీరు తాగే బీరు కంటే ప్రభుత్వం తాగే పన్నులే ఎక్కువగా ఉంటున్నాయి. అసలు ఈ ధరల మాయాజాలం ఎలా సాగుతుంది? సెంట్రల్, స్టేట్ ట్యాక్సుల మధ్య వ్యత్యాసం ఎంత? అన్నది ఒకసారి లోతుగా విశ్లేషిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

Why Beer is Costly in India Deep Dive into Excise Duty VAT and the Rs 180 Bottle Price Breakdown

Beer రేట్లు.. సీన్ రివర్స్..

సాధారణంగా ఏ వస్తువు కొన్నా దాని తయారీ ఖర్చుకు కొంత లాభం కలిపి అమ్ముతారు. కానీ మద్యం విషయంలో సీన్ రివర్స్. ఇక్కడ తయారీ ఖర్చు ఒక వంతు ఉంటే, పన్నులు పది వంతులు ఉంటాయి. ముఖ్యంగా ఈ పన్నుల వ్యవస్థను పరిశీలిస్తే, మందుబాబులు ప్రభుత్వానికి 'అప్రకటిత దాతలు'గా ఎందుకు మారుతున్నారో అర్థమవుతుంది.

ఎవరి జేబులోకి ఎంత వెళ్తుంది? (The Profit Share)

ఒక రూ. 180 బీర్ బాటిల్ ప్రయాణాన్ని గమనిస్తే, అందులో సింహభాగం రాష్ట్ర ప్రభుత్వాల పరం అవుతోంది.

  • రాష్ట్ర ప్రభుత్వం : మద్యంపై రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty),స్టేట్ వ్యాట్ (State VAT) కలిపి దాదాపు రూ. 105 (58%) నేరుగా రాష్ట్ర ఖజానాలోకి వెళ్తుంది. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ నిర్వహణకు ఈ నిధులే ప్రాణాధారం.
  • కేంద్ర ప్రభుత్వం: నిజానికి మద్యం GST పరిధిలోకి రాదు. కానీ, తయారీకి వాడే ముడి పదార్థాలు (మాల్ట్, గ్లాస్ బాటిల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్) మీద కేంద్రానికి GST వెళ్తుంది. ఇది చాలా తక్కువ మొత్తం.
  • తయారీ కంపెనీ & రిటైలర్: బాటిల్ అమ్మగా వచ్చే లాభం తయారీ కంపెనీకి కేవలం రూ.15 మాత్రమే దక్కుతుంది. షాపు యజమానికి, డిస్ట్రిబ్యూటర్లకు కలిపి మరో రూ.20 మిగులుతుంది.

విభాగం

మొత్తం (₹)

వివరణ

అసలు బీరు (Liquid Cost) ₹30 తయారీకి అయ్యే అసలు ఖర్చు
రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ₹70 నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్ను
స్టేట్ వ్యాట్ (VAT) ₹35 పన్నుపై అదనంగా వేసే వ్యాట్
డీలర్ & షాప్ మార్జిన్లు ₹20 విక్రయదారుల లాభం
కంపెనీ లాభం & ప్యాకేజింగ్ ₹25 రవాణా, ప్యాకింగ్ మరియు కంపెనీ లాభం
మొత్తం MRP ₹180 వినియోగదారుడు చెల్లించే ధర

GST లోకి వస్తే ధర తగ్గుతుందా?

ఒకవేళ మద్యం గనుక GST పరిధిలోకి వస్తే (అత్యధికంగా 28% స్లాబ్ అనుకున్నా), బాటిల్ ధర భారీగా తగ్గుతుంది. కానీ అప్పుడు ఆదాయం మొత్తం కేంద్రం, రాష్ట్రం పంచుకోవాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని GST లోకి రానివ్వడం లేదు. ఈ "లిక్కర్ సిండికేట్" వల్లే బాటిల్ తయారీ ధర కంటే పన్నులే 300% ఎక్కువగా ఉంటున్నాయి.

అంటే మీరు రూ. 180 పెట్టి బీర్ తాగితే, అందులో ₹30 విలువైన బీరు తాగుతూ, మిగిలిన ₹150 ప్రభుత్వానికి 'సంక్షేమ నిధి'గా ఇస్తున్నారన్నమాట! నిజం చెప్పాలంటే, మందుబాబులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+